ఆగస్టు 15న ఐరాసలో రెహమాన్ కచేరీ

A R Rahman music concert in Irasa

10:51 AM ON 10th August, 2016 By Mirchi Vilas

A R Rahman music concert in Irasa

ఇదో అద్భుత అవకాశం. భారత్ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఎ.ఆర్.రెహమాన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి శత జయంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆమె ఛాయాచిత్ర ప్రదర్శన(ఆగస్టు 15-19) కూడా ఇందులో ఉంటుంది. ఐరాసలో భారత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని ట్వీట్ లో వెల్లడించారు. సుబ్బులక్ష్మి సరిగ్గా యాభై ఏళ్ల క్రితం(1966) ఐరాస సర్వప్రతినిధి సభలో సంగీత కచేరీ చేశారు.

తిరిగి ఆ గౌరవం అందుకుంటున్న రెండో భారతీయుడు ఎ.ఆర్.రెహమాన్ కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని చెన్నైకి చెందిన శంకర నేత్రాలయ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది. శంకర నేత్రాలయ సుధా రఘునాధ్, జుబిన్ మెహతా, అనౌష్క శంకర్ తదితర భారతీయ విద్వాంసులతో అమెరికాలో పలు కచేరీలు తలపెట్టింది. శంకర నేత్రాలయ ఆప్తాల్మిక్ మిషన్ ట్రస్ట్ కూడా ఈ సందర్బంగా మరికొన్ని కచేరీలు నిర్వహిస్తోంది.

English summary

A R Rahman music concert in Irasa