మైనర్ బాలికపై రేప్ కేసులో 150ఏళ్ల జైలు...

A Rapist In America Punished For 150 Years

03:40 PM ON 15th March, 2016 By Mirchi Vilas

A Rapist In America Punished For 150 Years

అభం శుభం తెలీని ఓ పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి కోర్టు ఏకంగా 150ఏళ్ల జైలు శిక్ష విధించింది. 58ఏళ్ళ వయస్సులో పసి పిల్ల పై పశువులా ప్రవర్తించిన ఆ జంతువుకు ఇదే సరైన శిక్ష అంటూ యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి ఒటిస్‌ రైట్‌ పేర్కొనడం చూస్తుంటే, ఎంత సీరియస్ గా ఈ కేసుని జడ్జి పరిగణించి, తీర్పు ఇచ్చారో అర్ధమవుతుంది. ఇక ఛార్జిషీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం చూస్తే,...

అమెరికా, రష్యా పౌరసత్వాలు కలిగిన 58ఏళ్ల యూసెఫ్‌ అబ్రమోవ్‌ అనే వ్యక్తి పలు పర్యాయాలు రష్యాలో పర్యటించాడు. ఈ నేపథ్యంలో 2009 జూన్‌లో రష్యాలో 12ఏళ్ల బాలికపై యూసెఫ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అలా యూసెఫ్‌ ఎప్పుడు రష్యా వెళ్లినా.. అక్కడి బాలికలతో క్రూరంగా ప్రవర్తించేవాడు. అంతేగాక, అతడి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలికలపైనా తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారాలకు పాల్పడేవాడు.

దీంతో యూసెఫ్‌ను పట్టుకునేందుకు అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టి 2014 ఏప్రిల్‌లో అతడిని అరెస్టు చేశారు. దీని పై యూఎస్‌ న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. యూసెఫ్‌కు 45ఏళ్ల జైలుశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. అయితే అతడి నేరాలకు 150ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయినా ఇది సరైన శిక్ష కాదని ఇంకా కఠినం గా శిక్ష వుండాలని పలువురు వ్యాఖ్యానించారట.

English summary

A 58 year old man who had both America and Russia Citizenship rapes a 15 year girl in russia for many times and Later American police arrested him and court punishes him for 150 years of prison.