షూటర్ ని కాల్చి చంపిన రోబో

A robo killed shooter in America

03:38 PM ON 9th July, 2016 By Mirchi Vilas

A robo killed shooter in America

సాధారణంగా బాంబులను నిర్వీర్యం చేసేందుకు రోబోలను వాడుతారు. కానీ అమెరికా పోలీసులు మొట్టమొదటిసారి డల్లాస్ షూటర్ ని చంపడానికి రోబోను ఉపయోగించారు. పోలీసులను కాల్చి చంపిన షూటర్ జాన్సన్ ను శాంతింప చేసేందుకు అతనితో చర్చలు నిర్వహించారు. వీలైనంత వరకు అతన్ని నిరాయుధున్ని చేసేందుకు ప్రయత్నించారు. షూటర్ జాన్సన్ మాత్రం పోలీసులతో చర్చలు కొనసాగిస్తూనే కాల్పులకు దిగాడు. అతన్ని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. ఆ సమయంలో ఏం చెయ్యాలో పాలిపోక పోలీసులు రోబోని రంగంలోకి దించారు. డల్లాస్ అనుమానితున్ని మట్టి కరిపించేందుకు సీ4 అని పిలువబడే ప్లాస్టిక్ బాంబుతో పేల్చేశారు.

బాంబులను నిర్వీర్యం చేసే రోబో ఆర్మ్తోనే షూటర్ పై ప్లాస్టిక్ బాంబును ప్రయోగించారు. గతంలో అనేక సందర్భాల్లో పోలీసులు నేర పరిశోధనల్లో రోబోలను వాడేవారు. అయితే తొలిసారి అమెరికా పోలీసులు ఓ షూటర్ ని పేల్చేందుకు రోబో పరికరాన్ని వాడారు. ఉగ్ర దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా స్వాట్ పోలీసు బృందాలు ప్రస్తుతం ఇలాంటి రోబోలకు శిక్షణ ఇస్తున్నారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న యుద్ధాలకు ఇలాంటి రోబోలనే వినియోగిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.

English summary

A robo killed shooter in America