అతని జీతం రూ. 1200 కానీ అతని ఇంట్లో కోట్ల డబ్బు.. ఎలా?

A sales men get 1200 salary for month but he is millionaire

03:36 PM ON 28th September, 2016 By Mirchi Vilas

A sales men get 1200 salary for month but he is millionaire

ఇదేదో సినిమా అనుకునేరు.. మాయ అంత కన్నా కాదు.. నిజంగా నిజం. అసలు విషయంలోకి వెళితే.. అతను పేరు సురేష్ ప్రసాద్. అతను ఒక వోల్ సేల్ దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతని నెల జీతం పన్నెండు వందల రూపాయలు కాని అతని కోటీశ్వరుడుగా అయ్యాడు. అతని ఇంట్లో కోట్లాది రూపాయల డబ్బు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో చోటుచేసుకుంది. సిధీ జిల్లాకు చెందిన వోల్ సేల్ దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నసురేష్ ప్రసాద్ పాండే ఇంటిపై దాడి చేసిన లోకాయుక్త అధికారులు కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు.

సురేష్ ప్రసాద్ కు సంపాదనకు మించిన ఆస్తులున్నాయనే ఫిర్యాదుతో అధికారులు అతని ఇంటిపై దాడి చేయగా ఇంట్లో కోట్లాదిరూపాయల విలువచేసే బంగారంతోపాటు బొలేరో, ఆల్టో కారు, హోండా షైన్, యాక్టివా బైక్ లు, డబుల్ బ్యారెల్ గన్ లను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సేల్స్ మెన్ ఇంట్లో ఆయన సంపాదన కంటే 200రెట్ల అధికంగా డబ్బు ఉందని లోకాయుక్త అధికారులు సురేంద్రసింగ్, దేవష్ పాఠక్ లు చెప్పారు. పలు భూములు, భవనాలకు సంబంధించిన పత్రాలు దొరికాయని లోకాయుక్త ఎస్పీ టీకే విద్యార్థి చెప్పారు. పాండేకు, అతని భార్య, కొడుకుల పేరిట 8 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని ఎస్పీ సమాచారాన్ని అందచేసారు.

English summary

A sales men get 1200 salary for month but he is millionaire