ఈ పొట్టోడు బైక్ నడపడం చూస్తే షాకవ్వాల్సిందే(వీడియో)

A short man riding bike

03:33 PM ON 30th July, 2016 By Mirchi Vilas

A short man riding bike

పొట్టోళ్లు గట్టోళ్లు అనే సామెత అక్షరాలా నిజం చేస్తోంది ఈ వీడియో.. ఓ వ్యక్తి బిజీగా ఉన్న రోడ్డు మీద బైక్ పై వెళుతున్నాడు. అతడు కొంచెం పొట్టి వ్యక్తి. బైక్ మీద కూర్చుంటే కాళ్లు కింద వరకు అందవు కానీ, గేర్లు మార్చడానికి, బ్రేకులు వేయడానికి మాత్రం వీలుగా ఉంటుంది. దీంతో అతడు తన లోపాలను గుర్తు చేసుకుని బాధపడుతూ కూర్చోలేదు. బైక్ నడపడం నేర్చుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సాధన చేశాడు. తాను కూడా సురక్షితంగా బైక్ నడపగలనని నిరూపించాడు. అతడి బైక్ వెనకాలే కారులో వెళ్తున్న కొందరు అతడు బైక్ నడిపే విధానాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో హేళన చేస్తూ, పోస్ట్ పెట్టారు.

దీంతో వాళ్ల ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో తీస్తే తీశారు గానీ, అడిని చూసి నవ్వుకోవడం కాదు, అతడిని చూసి నేర్చుకోండి అంటూ కామెంట్స్ కుమ్మేసారు.

English summary

A short man riding bike