ఉదయ భానుని అవమానించిన సింగర్ ఎవరు?

A singer shamed Udaya Bhanu

03:20 PM ON 29th August, 2016 By Mirchi Vilas

A singer shamed Udaya Bhanu

యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని తెలుగు టీవీ రంగంపై ఉదయభాను ఓ ప్రత్యేక ముద్ర వేసింది. టాప్ వ్యాఖ్యాతగా కొనసాగుతూనే, వెండితెర మీద మెరిసింది. అయితే కొంతకాలంగా ఈ ఫేమస్ యాంకర్ కనబడడం లేదు. దానికి కారణం తాను ఇప్పుడు గర్భవతినని, కవల పిల్లలు పుట్టబోతున్నారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అంతేకాదు గతంలో తనను ఓ సింగర్ గతంలో అవమానించిన విషయం కూడా ఇప్పుడు బయటపెట్టింది. గతంలో యూఎస్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించా. అప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ ఫిమేల్ సింగర్ నన్ను అవమానించింది. ఆమెను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు నేను ఎంతో గొప్పగా ఆమె గురించి చెప్పేదాన్ని.

కానీ, ఆ టూర్ చివరి రోజున ఆమె ముందు స్టేజ్ మీదకు వెళ్లి నన్ను పిలుస్తానని చెప్పింది. అందరినీ పిలిచింది కానీ, నన్ను మాత్రం పిలవలేదు. ఆఖరుకి నా అంతట నేనే వేదిక పైకి వెళుతుండగా, ఆ సింగర్ కు చెందిన ఆర్కెస్ట్రా ఓ నీరసపు ట్యూన్ ప్లే చేసి నన్ను మరింత అవమానించారు. తర్వాత ఆ సింగర్ నాకు ఏదో సర్ది చెప్పబోయింది. కానీ, నేను పట్టించుకోలేదు అంటూ ఉదయభాను చెప్పుకొచ్చింది. ఇలాంటి అవమానాలు తనకు ఎన్నో జరిగాయని ఆమె పేర్కొంటూ, అందుకే తనకు బయట స్నేహితులే తప్ప, ఇండస్ట్రీలో ఎవరూ లేరని తెలిపింది. అయితే తనను అవమానించిన సింగర్ పేరు మాత్రం ఆమె చెప్పకపోవడం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందని కొందరు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మీకు టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగే అలవాటు ఉందా? అయితే..

ఇది కూడా చదవండి: అక్కినేని నాగ్ గురించి తెలీని నిజాలు!

ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్స్ మధ్య క్రష్డ్ స్టోన్స్ ఎందుకు వేస్తారో తెలుసా?

English summary

A singer shamed Udaya Bhanu. A singer shamed anchor Udaya Bhanu on stage.