ప్రేయసితో పెళ్లిని వ్యతిరేకించిన తల్లిని ఏం చేసాడో తెలుసా

A Son Killed His Mother For Not Accepting Marriage With His Girl Friend

12:00 PM ON 22nd December, 2016 By Mirchi Vilas

A Son Killed His Mother For Not Accepting Marriage With His Girl Friend

బంధాలు అనుబంధాల కన్నా తన ఇష్టా ఇష్టాలే ఎక్కువై పోయిన రోజులివి. అందుకే తరతమ బేధం లేకుండా చివరకూ కన్నతల్లి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా తనకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లిని వ్యతిరేకించిందనే ఆగ్రహంతో కన్న తల్లిని ఓ కర్కోటకుడు తుపాకీతో కాల్చి చెంపేసాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, భోపాల్ నగరంలోని గౌతంనగర్ ప్రాంతానికి చెందిన జమీలాబి బీజేపీ మహిళా విభాగం నాయకురాలిగా పనిచేసేవారు. జమీలాబీకి అమన్ (22) అనే కుమారుడున్నాడు. తల్లి తాను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లిని తల్లి వ్యతిరేకించిందనే కోపంతో అమన్ దేశీ తుపాకీతో కాల్చి చంపాడు.

అయితే, తాను హాలులో నిద్రపోతుండగా తల్లిని ఎవరో వచ్చి కాల్చిచంపారని అమన్ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మళ్లీ మాట మార్చి తన తల్లి విద్యుదాఘాతంతో మరణించిందని....కాదు కాదు గ్యాస్ సిలిండరు రెగ్యులేటర్ పేలి చనిపోయిందని చెప్పాడు. ఇలా మాటలు మారుస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించిన అమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. అమన్ స్థానికంగా ఉన్న ఓ అమ్మాయిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. కాగా దీన్ని వ్యతిరేకించిన తల్లి జమీలాబి అమ్మాయి ఎంపిక తన ఇష్టంతోనే జరుగుతుందని తేల్చిచెప్పారు. దీంతో గతనెల 30 వ తేదీన తల్లీ కుమారుడి అమ్మాయి ఎంపిక విషయమై మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో .315 కంట్రీమేడ్ పిస్టల్ ను తీసుకువచ్చిన అమన్ తల్లిని కాల్చి చంపాడని తూర్పు ఎస్పీ అరవింద్ సక్సేనా చెప్పారు. పిస్టల్ ను స్వాధీనం చేసుకొని నిందితుడు అమన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అమన్ ను రిమాండుపై జైలుకు పంపించింది.

ఇవి కూడా చదవండి: ఆమె అమ్మ కాదు ... దెయ్యం...

ఇవి కూడా చదవండి: ఆ ఖాతాలను 2 పైసల చొప్పున అమ్మేశారట!

English summary

A guy named Aman who was aged about 22 years and he killed his mother for not accepting marriage with his girl friend. Aman and his mother were quarreled on this matter and he bought gun and fired his mother with the gun.