జ్యూస్ తాగిందని జాబ్ లోంచి తీసేసాడు.. కానీ 1.86 కోట్లు చెల్లించాడు.. ఎందుకు?

A store owner dismissed employee for drinking juice without permission

11:26 AM ON 27th September, 2016 By Mirchi Vilas

A store owner dismissed employee for drinking juice without permission

గోరుతో పోతుందని భావించకుండా కొందరు గొడ్డలి వరకు తెచ్చుకుని ఆ తర్వాత బాధపడుతారు. తాజాగా అమెరికాలోని ఒక రిటైల్ చైన్ నడుపుతున్న వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన వద్ద వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అనుమతి లేకుండా, డబ్బులు చెల్లించకుండా స్టోర్ లో ఉన్న ఆరంజ్ జ్యూస్ ను తాగిందని ఉద్యోగంలోంచి తీసేశాడు. 1.69 డాలర్లు(115 రూపాయల) విలువ చేసే జ్యూస్ తాగినందుకు ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం వల్ల అతడు 2.78 లక్షల డాలర్లు(1.86 కోట్ల రూపాయలు) చెల్లించాల్సి వచ్చింది. ఎందుకంటే, అమెరికాలో ఉన్న చట్టం అతడి పాలిట శాపం అయ్యింది.

ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వారు అనుమతి లేకుండానే ఏదైనా ఎక్కడ నుండి అయినా తీసుకుని తినవచ్చు/తాగవచ్చు అనేది అమెరికాలో ఉన్న చట్టం. అలాంటి వారిని శిక్షించకూడదు. ఆ స్టోర్ లో జాబ్ చేస్తున్న యువతికి మధుమేహం ఉంది. ఒక రోజు ఆమె షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో ఆమె స్టోర్ లో ఉన్న ఆరంజ్ జ్యూస్ ను అనుమతి లేకుండా తాగేసింది. దాంతో అతడు జాబ్ నుండి తొలగించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చి 2.78 లక్షల డాలర్లను ఇప్పించింది.

ఇది కూడా చదవండి: మనిషి చితాభస్మం నుంచి వజ్రాలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. ఎక్కడ?

ఇది కూడా చదవండి: ఇంట్లో కూల్ డ్రింక్ ఉండటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు!

ఇది కూడా చదవండి: ఏజ్ బార్ యాక్టర్ తో లవ్ లో మునిగి తేలుతున్న చిన్నారి పెళ్లికూతురు!

English summary

A store owner dismissed employee for drinking juice without permission. For that she went to court and court fined to store owner 1.86 crores.