టీచర్‌ను చంపేస్తానని బెదిరించిన స్టూడెంట్‌

A student gave warning to teacher that i will kill you

04:57 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

A student gave warning to teacher that i will kill you

ఒకప్పుడు విద్యార్ధులు కష్టపడి చదివి పరీక్షలు రాసేవారు. కానీ నేటి కాలంలో నూటికి 90 శాతం విద్యార్ధులు కాపీ కొట్టి రాయడానికే అలవాటు పడిపోయారు. పబ్లిక్‌ పరీక్షలకే కాదు క్లాసులో టీచర్‌ నిర్వహించే ఓరల్‌ టెస్టులకి కూడా స్లిప్స్‌ పెట్టి కాపీ కొట్టి రాసేస్తున్నారు. పబ్లిక్‌ ఎగ్జామ్స్‌లో కూడా ఎంతో చాకచక్కంగా స్లిప్స్‌ పెట్టి పరీక్షలు రాసి పాస్‌ అయిపోతున్నారు. ఒకవేళ కాపీ కొడుతూ టీచర్‌కి దొరికేస్తే నన్ను సస్పెండ్‌ చెయ్యొద్దని టీచర్‌ ని బ్రతిమాలతారు, అందరి ముందు అవమానంగా ఫీలౌతారు. కానీ బరేలీలోని ఒక విద్యార్ధి మాత్రం కాపీ కొడుతూ స్క్వాడ్‌కి దొరికిపోతే చంపేస్తానని బెదిరించాడు. అవును ఇది నిజం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

బరేలీలోని పవన్‌ శర్మ అనే టీచర్‌ ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు స్క్వాడ్‌గా వ్యవహరించారు. అందులో భాగంగా ఆకాశ్‌ అనే విద్యార్ధి కాపీ కొడుతుండగా పవన్‌ రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకున్నారు. అతడు పెట్టిన స్లిప్స్‌ని, సెల్‌ఫోన్‌ ని స్వాధీనం చేసుకుని ఆకాశ్‌ని సస్పెండ్‌ చేసేశారు. దీనితో పవన్‌ పై కక్ష పెట్టుకున్న ఆకాశ్‌ పవన్‌ కి బెదిరిస్తూ మెసేజ్‌లు చేశాడు. చంపేస్తానని పవన్‌ వెంట పడ్డాడు. ఇంక పవన్‌ బరేలీ కాలేజ్‌ టీచర్స్‌ అసోషియేషన్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆకాశ్‌ ని అరెస్టు చెయ్యకపోతే మార్చి 19 నుంచి పరీక్షలని బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనితో పోలీసులు ఆకాశ్‌ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary

A student gave warning to teacher that i will kill you in Bareilly, Uttar Pradesh while he is copying in exam and teacher sent him out.