ఆత్మహత్య చేసుకున్న టీచర్.. ఫేస్ బుక్ లో నగ్న ఫోటోలు

A teacher gets suicide because of her vulgar photos in facebook

01:28 PM ON 29th June, 2016 By Mirchi Vilas

A teacher gets suicide because of her vulgar photos in facebook

టెక్నాలజీ మంచికి ఎంత ఉపయోగపడుతుందో, చెడుకి కూడా అంతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏ ఓ యువతి ప్రాణాలు బలికొంది. ఆ వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా ఇడనగనశాలైకి చెందిన అన్నాదురై కుమార్తె వినుప్రియ(20) తిరుచెంగోడు ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఈనెల 17న ఆమె అశ్లీల చిత్రాలు ఫేస్ బుక్ లో అప్లోడ్ అయ్యాయి. వాటిని చూసిన వినుప్రియ తండ్రి అన్నాదురై షాక్ కు గురయ్యాడు. వెంటనే జిల్లా ఎస్పీ అమితకుమార్ వద్ద ఫిర్యాదు చేశారు. ఆ చిత్రాలు ఫేస్ బుక్ లో వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని శంకగిరి డీఎస్పీ కందసామికి విజ్ఞప్తి చేశారు.

అయితే.. దీన్ని అవమానంగా భావించి మనస్తాపానికి గురైన వినుప్రియ ఆదివారం రాత్రి తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినుప్రియ అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసినవారిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్లేది లేదని ఆమె తల్లిదండ్రులు, బంధువులు సేలం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో సేలం కలెక్టర్ సంపత్ వినుప్రియ తలిదండ్రులతో చర్చలు జరిపారు. రెండు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం అన్నాదురై తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

మనస్తాపానికి గురైన తన కూతురిని పోలీసులు విచారణ పేరిట వేధింపులకు గురిచేశారని, నిందితులను అరెస్టు చేయకుండా తననే వేధించడంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని అన్నాదురై ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకు పట్టిన గతి ఏ అమ్మాయికీ రాకూడదని ఏడ్చేశారు. ఫేస్బుక్లో విడుదలైన అశ్లీల చిత్రాలను తొలగించేందుకు 15 రోజులు పడుతుందని పోలీసు అధికారులు చెప్పారని, ఆలోపున తన సెల్ఫోనకు కూడా ఆ ఫోటోలు రావడంతో తాను మరింత కుంగిపోయానని అన్నాదురై అన్నారు.

English summary

A teacher gets suicide because of her vulgar photos in facebook