ప్రియురాలిపై అనుమానంతో దిగజారిన టెక్కీ.. ఏం చేసాడో తెలుసా?

A techie blackmailed his lover with photos

10:46 AM ON 27th October, 2016 By Mirchi Vilas

A techie blackmailed his lover with photos

ప్రేమతో గెలుచుకోవడం మానేసి ద్వేషం పెంచుకుంటున్న మగవాళ్ల ఆగడాలు దారుణంగా ఉంటున్నాయి. ఇందుకోసం ఎలాంటి నీచానికైనా ఒడిగడుతున్నారు. చదువుకున్న వాళ్ళు సైతం చేసే దారుణం తలచుకుంటే మరీ హేయనీయంగా ఉంటోంది. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏకంగా ఐదంకెల జీతం అందుకుంటున్నాడు. అందమైన జీవితం. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఓ మ్యాట్రిమొనీ సైట్ ద్వారా మహిళకు పరిచమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరచూ బయట కలుసుకునేవారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఫేస్ బుక్ లో చాటింగ్, వాట్సాప్ లో టాకింగ్. అంతా సాఫీగా సాగుతోంది.

కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. ఆమె తనను దూరం పెడుతోందనే అనుమానం అతనిలో కలిగింది. ఇంకేముంది, ఫోటోలను నీలిచిత్రాల వెబ్ సైట్స్ లో పెడతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మెర్సిల్ అని, మ్యాట్రిమొనీలో ఇలాంటి వారి ప్రొఫైల్ ను చూసి నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు.

English summary

A techie blackmailed his lover with photos