ఆ మహిళా టెక్కీని కొడవలితో నరికేశాడు

A techie girl murdered in Chennai

01:23 PM ON 24th June, 2016 By Mirchi Vilas

A techie girl murdered in Chennai

మహిళలపై జరుగుతున్న దారుణాల్లో భాగంగా చెన్నైలో దారుణం జరిగింది. ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న స్వాతి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి కిరాతకంగా హతమార్చాడు. మృతురాలు స్వాతి, నగరంలోని దక్షిణ గంగై అమ్మన్ కొయిల్ వీధికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, స్వాతి ఇవాళ ఉదయం చెన్నైలోని నుంగబక్కమ్ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్ కోసం ఎదురుచూస్తోంది. ఉదయం ఆరున్నర గంటలకు రెండో నెంబర్ ప్లాట్ ఫాంపై ఆమె ట్రైన్ కోసం చూస్తుండగా, ఓ యువకుడు ఆమె దగ్గరకు వచ్చాడు.

ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. గొడవ తీవ్రస్థాయికి చేరింది. తీవ్ర కోపోద్రేకుడైన ఆ యువకుడు అటుగా వస్తున్న ప్రయాణికుడి సంచిలో ఉన్న కొడవలిని తీసి అత్యంత కిరాతకంగా నరికేశాడు. ముఖంపై గాయపరిచాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ క్షణాల్లోనే స్వాతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్టేషన్ లో ఉన్న తోటి ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. స్వాతి చెన్నైలోని మరైమలైనగర్ లో ఉన్న మహీంద్ర టెక్ పార్క్ లోని ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. రైల్వేస్టేషన్ లో సీసీ కెమెరా లేకపోవడంతో పోలీసులు ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A techie girl murdered in Chennai