భార్య అక్ర‌మ సంబంధాన్ని టెక్నాల‌జీతో బయట పెట్టాడు

A techie revealed his wife secrets with technology

01:08 PM ON 9th May, 2016 By Mirchi Vilas

A techie revealed his wife secrets with technology

వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య గుట్టుని టెక్నాలజీ సాయంతో ఓ భర్త రట్టు చేసేసాడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ భార్య మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని చాలా సీక్రెట్‌గా త‌న తంతు కొన‌సాగిస్తోంది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌ పై అనుమానం వ‌చ్చిన ఆ టెక్కీ చాలా తెలివిగా ఆమె అక్ర‌మ సంబంధం గుట్టును ర‌ట్టు చేసి విడాకులు పొందాడు. బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్న 31 ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్య పై అనుమానం వచ్చింది. త‌న ఇంట్లో మూల సిగ‌రెట్ పీక‌లు ఉండ‌డం గ‌మ‌నించాడు.

ఇది కూడా చదవండి: మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఇంట్లో సిగ‌రెట్ తాగేవాళ్లు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన ఆ టెక్కీ ఈ విష‌య‌మై భార్య‌ను అడిగినా ఆమె త‌న‌కేం తెలియ‌ద‌ని బుకాయించింది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌ పై అనుమానం ఎక్కువ‌వ్వ‌డంతో నిఘా పెట్టాడు. ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశాడు. అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్ ను తన లాప్ టాప్ కు అనుసంధానం చేశాడు. అయితే భ‌ర్త‌కు అనుమానం రావ‌డంతో అతని భార్య కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నట్లు నటించింది. వ్యవహారం మళ్ళీ మొదలెట్టింది. జూలైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీ చెవినపడ్డాయి.

ఇది కూడా చదవండి: రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

ఇక ఇంట్లో ఉన్న సీసీ కెమేరాలు లివింగ్ రూమ్ లో, బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన లీలలన్నీ రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని అభ్యర్థించాడు. కోర్టు ఆ వీడియోలు నిజ‌మే అని నిర్ధారించి ఆ టెక్కీకి త‌న భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. పాప సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు కూడా తండ్రికే అప్ప‌గించింది.

ఇది కూడా చదవండి: కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

English summary

A techie revealed his wife secrets with technology. A techie revealed his wife secrets with technology. It means he puts cameras in bedroom and bathroom.