హన్సిక పై చెయ్యి వేసిన ఆకతాయి

A teenage boy misbehaves with Hansika

04:52 PM ON 30th April, 2016 By Mirchi Vilas

A teenage boy misbehaves with Hansika

గోవాలో హీరోయిన్ హన్సికకు చేదు అనుభవం ఎదురైంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్‌కు అక్కడికి వెళ్లింది. హన్సిక‌ పై సాయంత్రం నాలుగు గంటల సమయంలో బీచ్‌లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హన్సిక అభిమానులమంటూ కొందరు వ్యక్తులు సెట్‌లోకి వచ్చారు. ఆటోగ్రాఫ్ కావాలంటూ ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. వెళ్లిన వారిలో ఒకరు ఆమె పై చేయి వేశారు. షాకైన హన్సిక.. వారిని తోసివేసింది. పరిస్థితి గమనించిన యూనిట్ సభ్యులు ఆకతాయిలను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఆకతాయులకు యూనిట్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిన్న ఆ షూటింగ్ నిలిపివేశారు. మొత్తానికి గోవా పర్యటన హన్సికకు చేదు అనుభవం మిగిల్చిందన్న మాట.

English summary

A teenage boy misbehaves with Hansika. A teenage misbehaves with Hansika at beach.