షాకింగ్ న్యూస్ :బాలుడి రక్తం తాగి, గుండెను విసిరేశాడు

A Teenager Killed A Boy And Ate His Flesh And Drank His Blood

11:18 AM ON 23rd January, 2017 By Mirchi Vilas

A Teenager Killed A Boy And Ate His Flesh And Drank His Blood

నిత్యం ఎన్నో ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయి. కొన్ని ఘోరాలు తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిదే ఈ ఘోరం కూడా. పంజాబ్ లో లుథియానాకు 16 ఏళ్ల టీనేజర్ చేసిన ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే, తొమ్మిదేళ్ల బాలుడ్ని అత్యంత భయానకంగా, క్రూరంగా హత్య చేశాడు. డుగ్రీ ప్రాంతంలో కర్నైల్ సింగ్ నగర్ లో 8వ తరగతి చదవుతున్న ఈ విద్యార్థి, దూరపు బంధువు, ఇంటి పక్కన ఉండే దీపు అనే బాలుడ్ని మంగళవారం హత్య చేశాడు. తర్వాత నిందితుడు పిల్లాడి రక్తం తాగి, అతని తొడకండరాన్ని కోసి తిన్నాడు. దీపు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. హంతకుడు బాత్ రూమ్ లో వీటిని శుభ్రం చేసి, తీసుకెళ్లి నిర్మానుష ప్రాంతంలో పడేశాడు. అంతేగాక దీపు మృతదేహం నుంచి గుండెను తొలగించి స్కూల్ కాంపౌండ్ లోకి విసిరేశాడు. పోలీసులు దీపు మృతదేహపు భాగాలను, గుండెను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కు తరలించారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, నేరం చేసినట్టు అంగీకరించాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో దీపును కత్తితో పొడిచి చంపినట్టు ఒప్పుకున్నాడు. కేసు విచారణలో నిందితుడు చెప్పిన ఈ వివరాలు విని పోలీసులే షాకయ్యారు. స్కూలుకు వెళ్లడం తనకు ఇష్టంలేదని చెప్పాడు. స్కూలుకు చెడ్డపేరు తీసుకురావడం కోసం దీపు గుండెను స్కూల్లోకి విసిరినట్టు తెలిపాడు. దీపును కిడ్నాప్ చేశానని చెప్పి, అతని కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని నిందితుడు భావించాడని, తర్వాత ఈ పథకాన్ని విరమించుకున్నాడని పోలీసులు అంటున్నారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, నరమాంసం తినేందుకు క్రూరంగా ప్రవర్తిస్తాడని పోలీసులు చెప్పారు. కొన్నిసార్లు అతను తన చేతులను తానే కొరుక్కునేవాడని కుటుంబ సభ్యులు చెప్పారట.

ఇవి కూడా చదవండి: శాంతి మహాయజ్ఞంలో మెగాస్టార్ కుటుంబం

ఇవి కూడా చదవండి: భార్య అందుకు ఒప్పుకోవడం లేదని బొద్దింకలు వదిలాడు

English summary

A 16 year old teenager from Ludhiana was killed a 9 year old boy in a cruel manner and he cut the body into 6 pieces and he ate the 9 year old boy flesh and he drank the blood also. Police filed case on him and arrested him.