రోజుకొకటి చొప్పున... మూడునెలల్లో 101 దోపిడీలు చేసాడు

A thief did 101 robberies in 3 months

04:17 PM ON 7th October, 2016 By Mirchi Vilas

A thief did 101 robberies in 3 months

దొంగల్లో రికార్డు దొంగ ఇతగాడు. సగటున రోజుకో దొంగతనం, దోపీడియో చేస్తూ మూడు మాసాల్లో 101 దోపిడీలు సాగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. అవును అలనాడు శిశుపాలుడిని నూరు తప్పులు కాస్తానని, నూరు దాటితే శిరచ్ఛేదం చేస్తానని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. కదా అదే రీతిలో ఆస్ట్రేలియా దేశంలో కేవలం మూడు నెలల్లో 101 దోపిడీలు చేసిన దొంగను ఆస్ట్రేలియా దేశ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా దేశంలోని వెల్లింగ్బొరో నగరానికి చెందిన బిట్టర్ బ్రైన్ ప్లుంబ్ అనే 41 ఏళ్ల వ్యక్తి కేవలం మూడు నెలల్లో 101 దోపిడీలు చేసి పోలీసులకే సవాలు విసిరాడు.

2012 వసంవత్సరంలో బిట్టర్ కు నార్తాంప్టన్ నగరంలో దోపిడీలు చేసిన ఘటనలో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. బకింగ్ హామ్ బహిరంగ జైలు వద్ద కస్టడీ నుంచి తప్పించుకున్న బిట్టర్ మళ్లీ దోపిడీలకు తెర తీశాడు. దీంతో మళ్లీ కోర్టు తాజాగా బిట్టర్ ను ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇతను జూన్, జులై, ఆగష్టు నెలల్లోనే దోపిడీలకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ఆగస్టు 30వతేదీన ఓ ఇంటి కిటికీ నుంచి దూకి పారిపోతుండగా పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. నిందితుడు బిట్టర్ ప్రతిరోజూ ఓ దోపిడీ చొప్పున పలు దోపిడీలకు పాల్పడ్డాడని సీఐడీ డిటెక్టివ్ ఇన్ స్పెక్టరు హెలెన్ కైట్ చెప్పారు. కాగా ఈ దొంగ దోచుకున్న సొత్తు మాత్రం రికవరీ కాలేదు.

English summary

A thief did 101 robberies in 3 months