జూలో తప్పించుకున్న పులి.. ఇంతకీ ఏమైందో తెలుసా?

A tiger escaped from a Zoo

11:28 AM ON 29th November, 2016 By Mirchi Vilas

A tiger escaped from a Zoo

పెద్దపులిని చూస్తేనే భయం. అలాంటిది ఓ పెద్ద పులి జూ నుంచి తప్పించుకుంటే, ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అందుకే పులి తప్పించుకున్న విషయం తెలిసిన సందర్శకులు భయంతో హడలిపోయారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జూలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఎలా తప్పించుకుందంటే, పులి ఎన్ క్లోజర్ లోకి ఎవరో బూర విసిరారు. దీంతో అది ఆగ్రహంతో ఫెన్సింగ్ నుంచి బయటపడింది. సెలవు రోజు కావడంతో సందర్శకులు ఎక్కువగానే ఉన్నారు. పులిని చూసి కొందరు భయాందోళనతో పరుగులు తీసి సురక్షిత ప్రాంతాల్లో దాక్కున్నారు.

అయితే, వెంటనే అప్రమత్తమైన జూ సిబ్బంది వాహనాల్లో సందర్శకులను బయటకు తరలించారు. గంటన్నరపాటు శ్రమించి పెద్ద పులిని పట్టుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పులి తప్పించుకున్న వైనంపై దర్యాప్తు చేస్తున్నట్లు జూ అధికారులు ప్రకటించారు.

English summary

A tiger escaped from a Zoo