స్కూల్ గ్రౌండ్‌ నుంచి విద్యార్ధిని ఎత్తుకెళ్లిన దెయ్యం(వీడియో)

A tornado takes a student upto 4 metres

11:14 AM ON 26th April, 2016 By Mirchi Vilas

A tornado takes a student upto 4 metres

చైనా గాన్‌సు ప్రావిన్స్‌లో సుడిగాలి ఓ ప్రైమరీ స్కూల్ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చింది. విద్యార్ధుల పుస్తకాలను, బ్యాగులను గాల్లోకి ఎత్తి పడేసింది. అంతటితో ఆగక ఓ గ్రేడ్ త్రీ విద్యార్ధిని నాలుగు మీటర్ల ఎత్తులో పడేసింది. దీంతో ఆ విద్యార్ధికి గాయాలయ్యాయి. విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులంతా క్రీడా దినోత్సవం జరుపుకునేందుకు స్కూల్ గ్రౌండ్‌కు వచ్చినప్పుడు ఈ దెయ్యపు గాలి దూసుకొచ్చింది. దీంతో అంతా టెన్షన్‌కు గురయ్యారు. నాలుగు మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లాక విద్యార్ధిని కింద పడేసింది. కింద పడిన విద్యార్ధి ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


English summary

A tornado takes a student upto 4 metres. A tornado in Chaina school ground takes a student 4 metres up and dropped down.