బిడ్డను కన్నాడు.. పాలిస్తున్నాడు..

A transgender feeding milk to his baby

10:37 AM ON 6th September, 2016 By Mirchi Vilas

A transgender feeding milk to his baby

వాటే సర్ప్రైజ్.. ఈలోకంలో సృష్టికి ప్రతి సృష్టి చేయడం అంటే ఇదేనేమో. లేకుంటే, ఓ మగాడు బిడ్డను కనడం ఏమిటి? పైగా పాలు ఇవ్వడం ఏమిటి? అవును ఇది నిజంగా అద్భుతమే. ఇంతకీ విషయం ఏమంటే, ట్రాన్స్ జెండర్ వ్యక్తి సంతానం కనడమే కాకుండా బిడ్డకు పాలిస్తున్న విషయం తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అమెరికాలోని బోస్టన్ కు చెందిన జెస్సీ హెంపెల్ సోదరుడు ఇవాన్ మహిళగా పుట్టాడు. అయితే పదహారేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకున్నాడు. ట్రాన్స్ జెండర్ గా మారినా బిడ్డకు జన్మనివ్వాలన్న కోరిక మాత్రం అతడిలో ఉండిపోయింది. ఈ ఏడాది ఆయన తొలి బిడ్డకు జన్మనిచ్చి తన కోరిక తీర్చుకున్నాడు.

అంతేకాదు బిడ్డకు బ్రెస్ట్(చెస్ట్) ఫీడింగ్ ద్వారా పాలిచ్చి పెంచుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఇవాన్ కు 35 ఏళ్లు. మహిళగా పుట్టిన ఇవాన్ 19 ఏళ్ల వయసులో లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారాడు. హార్మోన్ చికిత్స చేయించుకున్నాడు. అయితే ఇవాన్ కోరిక మేరకు స్వతహాగా అతడిలో ఉండే మహిళా పునరుత్పత్తి అవయవాలు, వక్షోజాలు తదితర వాటిని వైద్యులు అలాగే ఉంచేశారు. ఒకవేళ అతడికి సంతానం కలిగితే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్ధేశంతో వైద్యులు వాటి జోలికి వెళ్లలేదు. ఇక మూడేళ్ల క్రితం ఇవాన్, అతడి భాగస్వామి ఇదే సరైన సమయమని భావించి పిల్లల్ని కనేందుకు నిర్ణయించుకున్నారు.

దీంతో వైద్యులు అతడికి కృత్రిమ గర్భధారణ ద్వారా ఫలదీకరణం చెందించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాన్ తన టెస్టోస్టిరాన్ షాట్స్ తీసుకోవడాన్ని నిలిపివేశాడు. చివరికి వైద్యుల ప్రయత్నం ఫలించింది. గతేడాది ఎవాన్ మగబిడ్డకు జన్మనిచ్చాడు. ఇప్పుడు పాలు ఇస్తూ లాలిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: సంగీత ప్రియులు మనసు దోచే విభిన్న సంగీత వాయిద్యాలు!

ఇది కూడా చదవండి: నిద్రలో ఉన్నప్పడు పడిపోతున్నామనే భావన ఎందుకు కలుగుతుంది?

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

English summary

A transgender feeding milk to his baby