రాశి ఖన్నాని వేధిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?

A unknown person following Rashi Khanna

06:42 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

A unknown person following Rashi Khanna

మనం సినిమాలో చిన్న గెస్ట్ పాత్రలో నటించిన రాశిఖన్నా ఆ తరువాత ఊహలు గుసగుసలాడే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడుకి జోరు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత గోపీచంద్ నటించిన జిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో కాస్త హాట్ గా కనిపించి కుర్రకారు మతుల్ని పోగొట్టింది. దీని తరువాత రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రంలో ఇంక రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు బానే వచ్చాయి.

తాజాగా సాయి ధరమ్ తేజ నటించిన సుప్రీమ్ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో ఇంక ఈ అమ్మడుకి అవకాశాలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రాశిఖన్నా సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో ఉండటానికి ఇష్టపడుతుందట. అయితే షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు రాశిఖన్నాని గుర్తుపట్టి పలకరిస్తున్నారట. దీంతో ఈ అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట. ఇదంతా బాగానే ఉన్నా రాశిఖన్నాని ఒక అపరిచుతుడు మాత్రం తెగ ఇబ్బంది పెడుతున్నాడట.

తను ఎక్కడికి వెళ్తే అక్కడకి వచ్చేస్తున్నాడట, ఆ వ్యక్తి వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది కానీ మిగతాదంతా చాలా అద్భుతంగా ఉందని రశిఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ వేధిస్తున్న వ్యక్తి ఎవరో మాత్రం చెప్పలేదు.

English summary

A unknown person following Rashi Khanna