నోట్ల రద్దు కష్టాలపై ఎఫ్బీలో 2 మిలియన్ల వ్యూస్... లక్ష షేర్లు(వీడియో)

A video crosses 2 millions views and 1 lakh shares in facebook

11:07 AM ON 15th November, 2016 By Mirchi Vilas

A video crosses 2 millions views and 1 lakh shares in facebook

ఇది మాత్రం నిజం. ఎందుకంటే, ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సంపన్నుల సంగతేమో కానీ, సామాన్యులు మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, అత్యవసర సేవలందించే విభాగాల్లో పాత నోట్లను తీసుకోవాలని మోడీ ప్రభుత్వం ఆదేశించింది. కానీ చాలాచోట్ల ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రుల యాజమాన్యాలు తుంగలో తొక్కాయి. ఇష్టారీతిగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇక విశాఖలో ఓ రెండున్నరేళ్ల పాప, ముంబైలో ఓ చిన్నారి... ఇలా ఎంతోమంది ఆసుపత్రుల నిర్లక్ష్య ధోరణికి బలైపోయిన వాళ్లే. అయితే తాజాగా ప్రజల ఇక్కట్లను కళ్లకు కట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

దాదాపు లక్ష మందికి పైగా ఈ వీడియో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అతి తక్కువ వ్యవధిలో 25లక్షల మందికి పైగా వీక్షించారు. కాంగ్రెస్ నేత హరిశంకర్ గుప్తా ఈ వీడియో పోస్ట్ చేశారు. ఓ కుటుంబం క్యూ లైన్ వద్ద నిల్చుని ఏడుస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, తమ వద్దనున్న నోట్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆ కుటుంబ పెద్ద వాపోయాడు. అతని భార్య బిగ్గరగా ఏడుస్తోంది. అయితే ఇదంతా అబద్ధమని బీజేపీ నేతలు కొట్టిపారేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లేందుకు కావాలని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

English summary

A video crosses 2 millions views and 1 lakh shares in facebook