'అమ్మ' విషయంలో ఓ వెబ్ సైట్ అడ్డంగా బుక్కయింది

A website booked in Jayalalitha health issue

11:26 AM ON 6th October, 2016 By Mirchi Vilas

A website booked in Jayalalitha health issue

గాసిప్స్ రాసేస్తూ, ఫోటోల మార్ఫింగ్ ఇష్టం వచ్చినట్లు చేస్తూ పొతే, ఎక్కడో అక్కడ బుక్కవ్వడం ఖాయం. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, సెప్టెంబర్ 22న ఆమె శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన సంగతి తెల్సిందే కదా. ఇక ఆమెకు అపోలో వైద్యులు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరి ఇప్పటికే దాదాపు 15 రోజులవుతోన్న నేపథ్యంలో తమిళ ప్రజలంతా అమ్మ ఆరోగ్యం పట్ల ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ వదంతులు వ్యాపించాయి. అదంతా అబద్ధమని, ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇప్పటివరకూ అమ్మ గురించి వస్తున్న వార్తల నేపథ్యం ఇది. అయితే వైద్యులు మాత్రం ఆసుపత్రిలోకి అందరినీ అనుమతించడం లేదు. పార్టీకి చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలకు మాత్రమే ఆమెను చూసే అవకాశం ఉంది. ఇలా ఆమెకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడంతో కొందరు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఐసీయూలో అమ్మ చికిత్స పొందుతున్న ఫోటో ఇదేనంటూ ఓ వెబ్ సైట్ లో పెట్టిన ఫోటో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటో చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఆ ఫోటోను బాగా పరిశీలించగా అది ఫేక్ ఫోటో అని తేలింది.

ఆమెను ఐసీయూలో ఉంచినట్లు కలరింగ్ ఇచ్చిన ప్రబుద్ధులు పక్కనున్న ఆసుపత్రి లోగోను మార్చడం మర్చిపోయారు. ఆమె చికిత్స పొందుతోంది అపోలో ఆసుపత్రిలో. కానీ పెట్టిన ఫోటోలో ఉన్న ఆస్పత్రి పేరు ఎస్ సలుద్. ఆ హాస్పటల్ నిజానికి పెరూలో ఉంది. జయలలిత అపోలోలో తప్ప మరే ఆస్పత్రికి వెళ్లలేదు. ఈ విషయం గుర్తించకపోవడంతో ఆ వెబ్ సైట్ అడ్డంగా బుక్కయింది. రేటింగ్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే తగిన బుద్ధి చెప్పక తప్పదని ఆమె అభిమానులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వధూవరులు పెళ్ళిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?

ఇది కూడా చదవండి: మరోసారి శృంగార సన్నివేశాల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా(వీడియో)

ఇది కూడా చదవండి: స్వాతంత్రానికి ఆగష్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు? అసలు జరిగిన కధేమిటి?

English summary

A website booked in Jayalalitha health issue. A website booked by showing fake photo of Jayalalitha in their website.