ఆకాశం నుంచి పడిందా? ఇంతకీ అది ఏమిటో తెలుసా?

A weird thing was fallen from the sky

11:13 AM ON 5th November, 2016 By Mirchi Vilas

A weird thing was fallen from the sky

గతంలో స్కైలాబ్ గురించి విన్నాం. అది భూమ్మీద పడుతుందని పెద్ద పెద్ద హెచ్చరికలు చేసారు. తీరా అది సముద్రంలో పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అది అప్పటిమాట. కానీ ఇప్పుడు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆకాశం నుంచి వూడి పడిన ఓ వస్తువు దిండుక్కల్ జిల్లాలోని ఒటన్ సత్రంలోని ప్రజలను ఆందోళనకు గురి చేసింది. మోదుపట్టి గ్రామంలోని కళత్తుక్కాడు వేలుస్వామి అనే రైతు పొలంలో బుధవారం అనూహ్యంగా ఓ వస్తువు ఆకాశం నుంచి కిందకు పడింది. ఆకాశం నుంచి మండుతూ వచ్చిన ఈ వస్తువు బంగాళాదుంప ఆకారంలో ఉంది. కాలిపోయిన స్థితిలో కనిపించగా గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అది పేలుడు పదార్థమై ఉంటుందేమోనని అనుమానించారు.

ఒక మీటరు పొడవు, 10 కిలోల బరువు ఉంది. ఆ గ్రామానికి చెందిన రంగస్వామి మాట్లాడుతూ తాను పొలం పనులలో నిమగ్నమై ఉండగా ఆ వస్తువు పెద్ద శబ్ధంతో కిందకు పడిందన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ జరిపారన్నారు. పురావస్తు శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సంబంధిత వస్తువు విమానంలోని ఏసీ విడిభాగంలా కనిపిస్తోందన్నారు. దీని వల్ల ప్రమాదమేమీ లేదన్నారు. కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రానికి తరలిస్తున్నట్లు వివరించారు. మొత్తానికి ఇది పెద్ద సంచలనమే సృష్టించింది.

English summary

A weird thing was fallen from the sky