వైట్ సారీ అమ్మాయి లిఫ్ట్ అడిగి... అంతలోనే మాయం... ఇంతకీ ఏమైంది?

A white saree ghost asked lift and disappeared on the spot

01:09 PM ON 1st August, 2016 By Mirchi Vilas

A white saree ghost asked lift and disappeared on the spot

ఈ ప్రపంచంలో ఎవరి గోల వారిది ఎవరి ఎక్స్ పీరియన్స్ వారిది. ఎందుకంటే, కొంతమంది దైవభక్తిలో మునిగితేలితే, మరికొందరు మాత్రం దేవుడే లేడంటారు. కొందరు దెయ్యాల భయంతో గజగజలాడిపోతుంటారు. అసలు దెయ్యాలే లేవంటారు మరికొందరు. దేవుడిని చూశారో లేదో తెలియదు కానీ దెయ్యాలను చూశామనే వారి సంఖ్య మాత్రం బానే ఉంటుంది. వాళ్ళ అనుభవాలు కూడా విచిత్రంగానే ఉంటాయి. ఇక ఇండియాలో ఇలాంటి భయంకర ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దెయ్యాలంటే ఆసక్తి, వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నవారు అలాంటి ప్రదేశాలు చూడాలని తహతహలాడుతుంటారు.

అలాంటి ప్రాంతాల్లో గడిపిన కొంతమంది అనుభవాల ఆధారంగా వ్యక్తిగత అనుభవాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి. అందులో కొన్ని...

1/5 Pages

1. జిపి బ్లాక్(మీరట్):


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న జిపి బ్లాక్ ను అత్యంత భయంకర ప్రదేశంగా చెప్పుకుంటారు. ఈ బంగ్లాలో నలుగురు కుర్రాళ్లు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపిస్తారట. తీరా దగ్గరకెళితే సడన్ గా మాయమవుతారట. ఈవిషయం ఈ బంగ్లాను చూడటానికి వెళ్లిన చాలామంది చెబుతుంటారు. అంతేకాదు, కొంతమంది అమ్మాయిలు రెడ్ డ్రస్ ధరించి బంగ్లా నుంచి బయటకు వెళ్లడం చూశామని కూడా కొందరు చెబుతుంటారు.

English summary

A white saree ghost asked lift and disappeared on the spot