మొగుడిలో మేటర్ లేదని విడాకులు కోరింది

A wife asked divorce for her husband is Eunuch

01:09 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

A wife asked divorce for her husband is Eunuch

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ పెళ్లైన రెండు వారాల్లోనే విడాకులు కోరింది. ప్రస్తుత కాలంలో విడాకులంటే మావిడాకులు కట్టినంత తేలికగా భావిస్తున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా చిన్న గొడవలకి కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. అసలు వీటన్నింటికి మనలో ఉండే అహమే(ego) కారణం. అందుకే నువ్వు గొప్పా, నేను గొప్పా అనే విధంగా తలబడి విడిపోవడానికి సిద్ధమైపోతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక అమ్మాయి విడాకులు కోరింది మాత్రం గొడవలు వల్ల కాదు తన భర్తలో విషయం లేదని.

అసలు విషయంలోకి వస్తే పశ్చిమ బెంగాల్‌ లోని ముర్షీదాబాద్‌ కి చెందిన 18 సంవత్సరాల వయస్సు గల అమ్మాయి వారం క్రితం పెళ్ళి చేసుకుంది. వివాహం అయ్యాక శోభనం రోజు రాత్రి గదిలోకి వెళ్లిన ఆ అమ్మాయి ఒక నగ్నసత్యం తెలుసుకుంది. అదేంటంటే తన భర్త ఒక నపుంసకుడని(తేడా) తెలుసుకున్న ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందని విలపించింది. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేకపోయింది. భర్తలో లోపాల్ని బయటకి చెప్పుకోలేని భార్యలు ఎంతో మంది ఉన్నారు. కానీ భర్త మగాడే కాదని తెలసుకున్న ఆ మహిళ మాత్రం ఇంక ఏ మాత్రం ఆలోచించకుండా ఆమె కుటుంబసభ్యులకి చెప్పింది.

ఆ తరువాత స్ట్రీట్‌ సర్వైవర్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన షబ్నమ్‌ రామస్వామి అనే వ్యవస్థాపకుడు వద్దకు వెళ్లి తన గోడును వివరించుకుంది. ఆమె సహకారంతో ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తన భర్తలో ఏమైనా లోపం ఉంటే డాక్టర్‌ కి చూపించే వాళ్లమని కానీ నా భర్త మగాడే కాదని దయచేసి నాకు ఎలా అయినా విడాకులు మంజూరు చెయ్యమని ఆ మహిళ పిటీషన్‌లో పేర్కొంది.

English summary

A wife asked divorce for her husband is Eunuch. A 18 years wife apllied for divorce in court for her husband is Eunuch.