బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

A wife cuts husband fingers

09:40 AM ON 17th May, 2016 By Mirchi Vilas

A wife cuts husband fingers

ఈ యాంత్రిక యుగంలో చాటింగ్ ఓ పెద్ద జబ్బులా తయ్యారయింది. ఈ విషయంలో వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ సెల్‌ఫోన్ చాటింగ్‌కు బానిసలు అయిపోతున్నారు. ఇలా అస్తమానూ చాటింగ్ చేయొద్దని చెప్పిన పాపానికి.. తన భర్త వేళ్లను చాకుతో కోసి పారేసింది ఓ భార్య. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్‌లో సునీతా సింగ్ టీచర్‌గా పని చేస్తుంటే, ఆమె భర్త చంద్రకాంత్ సింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా వున్నాడు. ఆమె ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్ పట్టుకుని స్నేహితులతో చాటింగ్ చేస్తూనే ఉండేది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య చాలాసార్లు తగాదా నడిచింది. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాత్రం చాటింగ్ మానుకోలేదు.

ఓసారి ఎందుకో అనుమానం వచ్చిన చంద్రకాంత్.. ఆమె ఫోన్ తీసి చూశాడు. అంతే, ఒక్కసారిగా షాకయ్యాడు. చాలా ఫోన్ లో డియర్, డార్లింగ్ అంటూ అవతలి వైపు నుంచి మెసేజిలు ఉన్నాయి. దాంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవైంది. అయితే ఆ సమయానికి ఆమె కిచెన్‌లో వంట చేస్తోంది. భర్త తన ఫోన్ తీసి చూడటంతో.. ఆవేశానికి గురైన ఆమె, కిచెన్‌లో చాకు తీసుకుని అతడి మూడు వేళ్లు కోసిపారేసింది. దాంతో లబోదిబోమంటూ అతడు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. తన భార్య పై గృహహింస చట్టం కింద కేసు పెట్టాడు. అదండీ సంగతి...

English summary

A wife cuts husband fingers