భర్తతో కాపురం కన్నా ప్రియుడితో చావే మేలనుకుంది.. కానీ ప్రియుడు..

A wife drunk poison for lover

12:45 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

A wife drunk poison for lover

అనుబంధం, పెళ్లి వెనుక పరమార్ధం తెలియకపోవడంతో కొన్ని కుటుంబాల్లో లేనిపోని అనుమానాలు, అపార్ధాలు నెలకొంటున్నాయి. ఫలితంగా ఏం చేస్తున్నారో కూడా తెలీడం లేదు. సర్దిచెప్పేవాళ్ళ కన్నా ఎగదోసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. పాపం ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుని, ఈ లోకం నుంచి నిష్క్రమిస్తున్నారు. ఈ విషాద ఘటనలోకి వెళ్తే.. వారిద్దరికీ వేర్వేరు వ్యక్తులతో 12 ఏళ్ళ క్రితం పెళ్ళయింది. ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమను మర్చిపోలేక రహస్యంగా తమ నిర్వాకం కొనసాగిస్తున్నారు. ఇక ఇరువురి కాపురాల్లోనూ ఇదే విషయంపై ఇటీవల గొడవ జరగడంతో బతకడంకన్నా చావడం మేలనుకుని ఇద్దరూ కలసి పురుగు మందు తాగారు. ప్రియురాలు చనిపోగా ప్రియుడు జీజీహెచ్‌ లో చికిత్స పొందుతున్నాడు.

మేడికొండూరుకు చెందిన మహిళ(35) పెళ్ళికి ముందే పేరేచర్లకు చెందిన బాబావలిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచి గుంటూరుకు చెందిన బేకరీ నిర్వాహకుడు వినయ్‌ కుమార్‌ తో వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆటో తోలుకుంటూ జీవించే బాబావలికి కూడా ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత కూడా బాబావలి, ఆ మహిళ రహస్యంగా కలుసుకుంటున్నారు. ఇందుకుగాను పేరేచర్లలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి ఇటీవల గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె వారం క్రితం పేరేచర్లకు వెళ్ళి ప్రియుడితో ఉంటోంది. విషయం వెలుగులోకి వచ్చి అందరికీ తెలియడంతో ఈనెల 17వ తేదీ రాత్రి ఇద్దరూ కలసి చనిపోదామని పురుగుల మందు తాగారు.

ఆమె ఎక్కువగా తీసుకోవడంతో స్పృహ కోల్పోయింది. స్పృహలో ఉన్న బాబావలికి బతుకు మీద ఆశ కలిగి ప్రియురాలిని కూడా బతికించుకుందామన్న ఆశతో ఆమెను భుజానపైన వేసుకుని పేరేచర్ల మెయిన్‌ రోడ్డుపైకి వచ్చాడు. అటు వెళ్తున్న వ్యాన్‌ ను ఆపి జీజీహెచ్‌ కు తీసుకొచ్చాడు. ఆసుపత్రిలో చేర్చి ఆమె బంధువులకు వర్తమానం అందించి, ఏమి తెలియని వాడిలా తను కూడా ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కుటుంబంలో మనస్పర్ధల కారణంగా పురుగులమందు తాగినట్లు తెలిపింది. బాబావలి కూడా జీజీహెచ్‌ లో చికిత్స పొందుతూ అదే కారణం చెప్పాడు. బుధవారం ఉదయం ఆ మహిళ మృతిచెందింది. విషయం తెలుసుకున్న బాబావలి ఆమె మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపించడంతో అసలు విషయం బయట పడింది. మేడికొండూరు పోలీసులు పూర్తిస్థాయిలో విచారించగా మొత్తం కథ వెలుగుచూసింది. కాగా బాబావలికి ప్రాణాపాయ స్థితిలేదని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు.

English summary

A wife drunk poison for lover