ప్రియుడు కోసం కూతురు, అత్తను చంపేసింది.. ఇంతకీ పడిన శిక్ష ఏంటో తెలుసా?

A wife killed her daughter and mother in law for lover

01:21 PM ON 13th July, 2016 By Mirchi Vilas

A wife killed her daughter and mother in law for lover

హత్యలు దోపిడీలు, దారుణాలు సర్వ సాధారనమయ్యాయి. ఈ విషయంలో వారూ వీరు అనే తేడాలేదు. తాజాగా కోర్టు తీర్పు చూస్తే, ఐటి జంట హంతకులని తేలింది. వివరాల్లోకి వెళ్తే, ప్రియుడితో కలిసి ఉండేందుకు కన్నకూతురు, అత్తను కడతేర్చిన కసాయి అను శాంతి, నినో మ్యాథ్యూలను తిరువనంతపురం కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇక్కడి టెక్నోపార్క్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేసే నినో మ్యాథ్యూ, అను శాంతి సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న అను శాంతి మూడేండ్ల కుమార్తె స్వస్థిక, అత్త ఒమానా, ఆమె భర్త లిజేష్‌ను హతమార్చేందుకు ప్లాన్‌ వేసుకున్నారు.

2004, ఏప్రిల్‌ 16న తమ ప్రణాళికను అమలు చేస్తూ.. అను శాంతి మూడేండ్ల కుమార్తెను, అత్తను దారుణంగా హతమార్చారు. భర్త లిజేష్‌ కోసం అరగంట పాటు వేచిచూసి రాగానే దాడికి తెగబడ్డారు. లిజేష్‌ ప్రాణాపాయం నుంచి తృతిలో తప్పించుకుని ఫిర్యాదు చేయడంతో మ్యాథ్యూను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రథమ నిందితుడు నినో మ్యాథ్యూను కఠినంగా శిక్షించాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. ఈ కేసులో 49 మంది సాక్షులను విచారించారు. 85 పత్రాలను సాక్ష్యాల కింద పరిగణించారు. నిందితుడి లాప్‌టాప్‌లో వెల్లడైన అంశాలను సాక్ష్యాలుగా ఆమోదించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందుతుల పై ఎలాంటి కనికరం చూపరాదని ప్రాసిక్యూషన్‌ వాదించింది.

అయితే ఇప్పుడు వారికి కోర్టు శిక్ష విధించింది. కోర్టు మాథ్యుస్ కు 50 లక్షల జరిమానాతో పాటు మరణశిక్ష విధించింది. అయితే.. తన కూతురి హత్యలో తన చేయి వేయలేదని.. మరణశిక్ష కంటే ఇతర ఏ శిక్ష ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అనుశాంతి మొరపెట్టుకుంది. దీనితో అనుశాంతిని 'అమ్మతనానికే మచ్చతెచ్చావు' అని ఆగ్రహించిన న్యాయస్థానం 50 లక్షల జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. ఈ మొత్తాన్ని ఆమె భర్త, మామకు చెందేలా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

English summary

A wife killed her daughter and mother in law for lover