భర్తను సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి.. ఆపై..

A wife killed her husband with hammer

12:48 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

A wife killed her husband with hammer

బంధాలు అనుబంధాల స్థానంలో చోటుచేసుకున్న అనుమాన పర్యవసానంగా జరిగిన ఇదో దారుణ హత్య... భర్తను అతి దారుణంగా ఓ భార్య హత్య చేసింది. పైగా ఎవరో చంపారని నాటకమాడబోయింది. చివరకు పోలీసులకు చిక్కింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి పెద్ద కమేళాకు చెందిన మాదాస్ సత్యనారాయణ(45) సోని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల నుంచి ఇద్దరూ ఘర్షణ పడుతున్నారు. తిరుమలగిరి చాలా సార్లు పోలీసులను ఆశ్రయించారు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన సత్యనారాయణ భార్యపై అనుమానంతో తరచూ ఘర్షణ పడుతుండేవాడు.

గురువారం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. సత్యనారాయణ మద్యం తాగి వచ్చి నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన సోని సుత్తితో భర్త తలపై కొట్టి కత్తితో ఇష్టం వచ్చినట్టు పొడవడంతో చనిపోయాడు. నిద్రపోయిన పిల్లలను లేపి గుర్తుతెలియని వ్యక్తులు చంపి పరారైనట్టు పోలీసులకు చెప్పాలని సూచించింది. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు సోనిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా.. తానే చంపినట్టు ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి, ఎస్ఐ శ్రీనునాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A wife killed her husband with hammer