భర్తని సెక్స్ తోనే చంపేయాలనుకుంది.. ఎలాగో తెలుసా?

A wife tried to kill her husband with romance

06:36 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

A wife tried to kill her husband with romance

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలకు కొదవే లేదు. భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భర్తలు ఎలా భరించలేరో, భర్తలు అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యలు కూడా అలానే సహించలేరు అనీ ఈ సంఘటన మరింత ఋజువు చేస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే.. కెన్యాకు చెందిన బీట్రస్ అనే ఓ భార్య తన భర్త వాకర్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు కెన్యాలో సంచలనంగా మారింది. భర్తకు వేరే మహిళలతో సంబంధాలున్నాయన్న అనుమానం ఆమెను ఈ పనికి ఉసికొల్పగా.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న తీరుగా.. శృంగార ప్రియుడైన భర్తను సెక్స్ ద్వారానే చంపేయాలని నిర్ణయించుకుంది బ్రీటస్.

పెళ్లయి నాలుగేళ్లు తిరగకుండానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం ఆమెలో తీవ్ర అసహనాన్ని రేపింది. దీంతో గత గురువారం తన ప్లాన్ ను అమలు చేసి భర్త వాకర్ ను హత్య చేయాలని భావించింది బ్రీటస్. ఇందుకోసం తన జననాంగానికి అత్యంత విషపూరిత రసాయనాన్ని పూసి భర్తను సెక్స్ లోకి దింపే ప్రయత్నం చేసింది. అయితే బ్రీటస్ జననాంగం నుంచి వస్తోన్న వాసనతో భర్త వాకర్ లో అనుమానం మొదలైంది. చివరికి అతని అనుమానం బలపడడంతో.. భార్య బ్రీటస్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇదే విషయమై భర్త వాకర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో హత్యాయత్నంపై విచారణ జరిపిన కోర్టు బ్రీటస్ కు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. తన భార్య ఎప్పటినుంచో తనను హత్య చేయాలని చూస్తోందని.. అందుకే ఆమె చేతులు మీదుగా మంచినీళ్లు ఇచ్చినా తాగడం మానేశానని భర్త వాకర్ పేర్కొనడం కొసమెరుపు.

English summary

A wife tried to kill her husband with romance