చనిపోయిన భర్తతో పిల్లల్ని కంటుందట!

A wife want to get pregnancy with her husband dead body sperm

04:18 PM ON 11th July, 2016 By Mirchi Vilas

A wife want to get pregnancy with her husband dead body sperm

ఏంటీ టైటిల్ చూసి ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. భర్త చనిపోతే మరో పెళ్లికి సిద్ధమవుతున్న ఆడవాళ్లు ఉన్న ఈ రోజుల్లో తన భర్త జ్ఞాపకార్థం తనకు ఓ బిడ్డ కావాలని ఒక యువతి డాక్టర్లను ఆశ్రయించింది. దీనితో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లకు గతంలో ఎప్పుడూ ఎదుర్కోని ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందో అసలు విషయంలోకి వెళ్తే.. ఆ యువతి భర్త హఠాత్తుగా మరణించడంతో అతణ్ని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అతను మరణించాడని డాక్టర్లు తెలిపారు. అయితే కొద్ది కాలం క్రితమే అతడికి పెళ్లి కావడంతో ఆ దంపతులకు ఇంకా సంతానం కలుగలేదు.

దీంతో తన భర్త వీర్యకణాలను సేకరించి దాని ద్వారా తను బిడ్డకు జన్మనిచ్చేలా చెయ్యాలని అతడి భార్య డాక్టర్లను కోరింది. ఆమె నిర్ణయాన్ని అత్తామామలు కూడా సమర్థించారు. కానీ పోస్టుమార్టం సమయంలో వీర్యం సేకరించేందుకు మన వద్ద స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో మన దేశంలో అటువంటిది కుదరదని డాక్టర్లు చేతులెత్తేసారు. కానీ ఇజ్రాయిల్ వంటి దేశాలలో భార్య కోరిక ప్రకారం భర్త మరణించిన తర్వాత అతని నుంచి వీర్యం సేకరించవచ్చు. అయితే సంవత్సరంలోగా ఆమె గర్భం దాల్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఈలోపు ఆమె కూడా మరణిస్తే ఆ స్పెర్మ్ ను వాడకూడదనే చట్ట నిబంధన కూడా ఉంది.

ఎవరు చనిపోయినా 24 గంటల పాటు వీర్య కణాలు జీవించే ఉంటాయని, వీటిని సేకరించడం చాలా తేలికైన ప్రక్రియ అని ఎయిమ్స్ ఫోరెన్సిక్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. అయితే ఈ విషయంలో న్యాయ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఏం చేయాలనే విషయమై స్పష్టత కోసం ఎయిమ్స్ డాక్టర్లు జర్నల్ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సైన్సెస్ లో ఓ ఆర్టికల్ ప్రచురితం చేశారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం భర్త మరణించాక కూడా అతడి వీర్యంతో భార్య గర్భం దాల్చవచ్చు. అయితే వీర్యం సేకరించే సమయానికి భర్త తప్పనిసరిగా జీవించి ఉండటంతోపాటు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి.

English summary

A wife want to get pregnancy with her husband dead body sperm