అద్దె గర్భం ధరిస్తే డబ్బిస్తామన్నారు... తీరా ఆతర్వాత ఏం చేసారో తెలుసా?

A woman accepted test tube baby for money

04:13 PM ON 28th October, 2016 By Mirchi Vilas

A woman accepted test tube baby for money

ఈరోజుల్లో అద్దె గర్భం సర్వ సాధారణం అయింది. పిల్లలకోసం పరితపించేవాళ్ళు ఇటువైపు మొగ్గుతున్నారు. వాళ్ళ ఆశలను నెరవేర్చడానికి కొందరు డబ్బుకోసం ముందుకొస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన జరిగింది. అయితే సీన్ రివర్స్ అవ్వడంతో, కేసుల దాకా వెళ్ళింది. అద్దె గర్భం దాలిస్తే, మంచి జీవితాన్ని ప్రసాదిస్తామని, రూ.2.5 లక్షల డబ్బులు ఇస్తామని చెప్పిన వైద్యులు, తీరా వారి పనిపూర్తయ్యాక ఛీత్కరించారంటూ కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ లోని రమా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై ఫిర్యాదు చేసింది.

ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తనలాంటి మహిళలెవరూ మోసపోకుండా చూడాలని కోరుతూ బాధిత మహిళ రమాదేవి గురువారం కడప జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోక్ అదాలత్(జిల్లా న్యాయసేవా సాధికార సంస్ధ) కార్యదర్శి యు.యు. ప్రసాద్ రమా టెస్టుట్యూబ్ బేబీ సెంటర్ కు నోటీసులు జారీచేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా వున్నాయి.

1/4 Pages

కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన రమణయ్య, రమాదేవి భర్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు కలిగిన తరువాత మనస్పర్థలు ఏర్పడడంతో విడాకులు తీసుకున్నారు. పిల్లలను పోషించేందుకు ఉద్యోగం కోసం రమాదేవి ప్రయత్నిస్తుండగా హైదరాబాద్ లోని అమీర్ పేటలో గల రమా టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఉద్యోగాలు ఉన్నాయని ఆసక్తిగలవారు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఓ పేపర్ లో ప్రకటన వచ్చింది. సదరు ఇంటర్వ్యూకు హాజరవ్వగా రమాదేవికి ఎవ్వరూ లేరనే విషయం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహకులు తెలుసుకున్నారు.

English summary

A woman accepted test tube baby for money