శవానికి తాళి కట్టించమంది ఎందుకో తెలుసా?

A woman asked to tie thread to her deadbody

01:18 PM ON 20th July, 2016 By Mirchi Vilas

A woman asked to tie thread to her deadbody

అవును నిజం.. మనసిచ్చినోడు మోసం చేస్తే, తట్టుకోలేకపోయిన ఓ అభాగ్యురాలు ఆత్మహత్య చేసుకుంది. మోసం చేసినా సరే అతడితోనే శవానికి తాళి కట్టించమంటూ సూసైడ్ నోట్ రాసింది. హృదయ విదారకమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో వారం క్రితం జరిగిన ఈ విషాదం ఆలస్యంగా వెలుగుచూసింది. నిజాంపట్నానికి చెందిన కొక్కిలిగడ్డ జ్యోతి, బాపట్లకు చెందిన కూలర్ మెకానిక్ తన్నీరు బాల మురళీకృష్ణ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే 3 నెలల క్రితం మురళీకృష్ణ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం జ్యోతికి తెలిసింది.

అప్పటికే ఆమె 7 నెలల గర్భిణిగా ఉండడంతో వారం క్రితం తెనాలిలో అతడిని కలిసి విషయం వివరించింది. గర్భవతి కావడానికి తనకు సంబంధం లేదని మురళీకృష్ణ చెప్పి వెళ్లిపోవడంతో జ్యోతి తీవ్ర మనస్తాపానికి గురైంది. బాలమురళీకృష్ణ ఇంటి వద్దకు వెళ్లిన జ్యోతి అక్కడే, ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను జీజీహెచ్ కు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. అయితే ఆమె చనిపోయే ముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను కిరోసిన్ పోసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో మురళీకృష్ణ తల్లి తనకు నిప్పంటించినట్లు పేర్కొన్నదని తెలుస్తోంది.

ఆమె రాసిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు జ్యోతి అందులో పేర్కొన్న విషయాలు చదివి నిర్ఘాంత పోయారు. తాను చనిపోతే మురళీతో తాళి కట్టించి అంత్యక్రియలు అతనితోనే జరిపించాలని జ్యోతి అందులో రాసిందని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్త్తున్నారు.

English summary

A woman asked to tie thread to her deadbody