నాలుగేళ్ళుగా మత్తు మందిచ్చి అత్యాచారం ... పైగా బ్లాక్ మెయిల్

A Woman Black Mailed And Raped For Four Years

02:46 PM ON 31st May, 2016 By Mirchi Vilas

A Woman Black Mailed And Raped For Four Years

దుర్మార్గం పెచ్చుమీరుతోంది. మహిళలపై అత్యాచారాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడు తున్నాడు ఓ దుర్గ్మార్గుడు. అంతేకాదు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని భయపెట్టి బంగారు నగలు, నగదును తీసుకున్నాడట. ఈమేరకు ఓ మహిళ పోలీసులకు ఫి ర్యాదు చేసింది. హైదరాబాద్ నగర శివారులోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కాలనీలో నివాసముండే మహిళ భర్త దుబాయ్ కు వెళ్లడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంటి పక్కన ఉండే ఓ మహిళ బంధువైన ఓ వ్యక్తి తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇంటి పక్కనున్న మహిళ, ఆ వ్యక్తి ఇద్దరూ కుట్ర పన్ని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చిన అనంతరం, స్పృహ కోల్పోయాక తనపై లైంగిక దాడికి పా ల్పడేవాడని బాధిత మహిళ తెలిపింది. వివస్త్రను చేసి తీసిన ఫొటోలను, వీడియోలను నెట్లో పెడతానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనను బెదిరించి ఇప్పటి వరకు 25 తులాల బంగారం, రూ.35 లక్షల నగదు తీసుకున్నాడని ఆ మహిళ వాపోయింది.

18 నెలలుగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని అక్కడికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. ఆ మహిళ భర్తకు చెప్పడంతో దుబాయ్ నుంచి రాగానే ఇద్దరూ కలిసి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతనికి సహకరించిన మహిళపై 376, 384, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:తల్లితో అక్రమ సంబంధం... భార్యను వ్యభిచారం చేయమని ఒత్తిడి

ఇవి కూడా చదవండి:యువతిని చంపేసి..గొనె సంచిలో చుట్టి...

English summary

A woman in Hyderabad was raped and taken that video and black mailed by the another person for four years and she and her husband were complained in Police station about this issue and police filed case and arrested the accused persons.