మగాడి వేషంలో యువతులను మోసం చేసిన మహిళ!

A woman cheated as a man in Singapore

11:51 AM ON 12th October, 2016 By Mirchi Vilas

A woman cheated as a man in Singapore

సాధారణంగా పురుషులు రకరకాల వేషాలు వేస్తూ ఆడాళ్ళను మోసగించడం చూస్తున్నాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ .. ఆడదే మగ వేషం కట్టి యువతులను మోసం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జునికా అహ్మద్ అనే 40 ఏళ్ల మహిళ మగాడిగా అవతారమెత్తి యువతులను మోసం చేసింది. తాను అబ్బాయినంటూ ఆమె అమ్మాయిలను లైంగికంగా వేధిస్తుండేది. అదిగాక ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంది. వారిపై లైంగిక దాడులకు పాల్పడేది. ఈ కేసులో ఆ మహిళకు హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. తాను అబ్బాయినంటూ కాలం గడుపుతున్న జునికా అనే మహిళ సింగపూర్ లో నివసిస్తుండేది.

అయితే ఓసారి 13 ఏళ్ల అమ్మాయికి మాయమాటలు చెప్పి లైంగిక దాడులకు పాల్పడింది. బాలిక అసలు విషయాన్ని బయటపెట్టడంతో బండారం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను పురుషుడిని కాదని జునికా చెప్పింది. దీంతో ఈ కేసులో ప్రధానమైన అత్యాచార ఆరోపణలను కొట్టేసి మహిళకు కోర్టు పదేళ్ల శిక్షను విధించింది.

English summary

A woman cheated as a man in Singapore