అమెరికా ఎన్నికల సర్వే కోసం ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

A woman did a survey for American elections

10:45 AM ON 8th November, 2016 By Mirchi Vilas

A woman did a survey for American elections

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సమయం వచ్చేసింది. నవంబర్ 8, మంగళవారం ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. అధ్యక్ష పీఠం చేజిక్కించుకోవడంలో రిపబ్లికన్ ట్రంప్, డెమోక్రాట్ హిల్లరీలు హోరాహోరీ ప్రచారం చేశారు. మితిమీరి విమర్శలు సరేసరి. ఇక వీరిద్దరిలో ఎవరు ముందున్నారని అనేక సంస్థలు పోల్ సర్వే ఫలితాలు విడుదల చేస్తున్నాయి. సర్వే బృందాలను ఏర్పాటుచేసి ఎవరేమి అనుకుంటున్నారో తెలుసుకుని సర్వే నివేదికలు ఇస్తుంటారు. కానీ వీటన్నింటికీ భిన్నమైన సర్వేతో ఈస్ట్ హ్యాంప్టన్ లో ఓ మహిళ అందరినీ ఆకర్షిస్తోంది. అదే కప్ సర్వే. న్యూయార్క్ లోని ఈస్ట్ హ్యాంప్టన్ లో ఓ దుకాణం యజమానురాలైన వేలరీ స్మిత్ దీనికి ఆద్యురాలు. గత మూడు ఎన్నికల్లోనూ ఆమె జోస్యం సరైన ఫలితాలే ఇవ్వడం గమనార్హం.

1/3 Pages

వేలరీ స్మిత్ తన దుకాణంలో కప్పులు విక్రయించి సర్వే చేస్తారు. వాటిపై అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ చిత్రాలు వుంటాయి. ఎవరి కప్పులు ఎక్కువ అమ్ముడు పోయాయో కాగితంపై రాసి దుకాణం బంద్ చేసే ముందు ప్రదర్శిస్తారు. ఒక వినియోగదారుడు కప్పులెన్ని కొన్నా ఒకటిగానే పరిగణిస్తారు. ఈసారి ఎన్నికలకు మార్చిలో జరిగిన సూపర్ ట్యూస్ డే తర్వాతి రోజు నుంచి విక్రయాలు ప్రారంభించారు.

English summary

A woman did a survey for American elections