తొమ్మిదేళ్ల క్రితం మరణించిన మహిళ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచింది

A woman died before 9 years but she won in elections now

05:19 PM ON 24th June, 2016 By Mirchi Vilas

A woman died before 9 years but she won in elections now

అవును మీరు విన్నది నిజమే! ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం మరణించిన మహిళ.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పంచాయతీ సమితి సభ్యురాలుగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ లో వెలుగుచూసింది. బిహార్ లోని సీతామర్తి జిల్లాకు చెందిన మిత్లేష్ దేవి అనే మహిళను తొమ్మిదేళ్ల క్రితం ఆమె భర్త సికందర్ ముఖియా హత్య చేశాడు. పోలీసుల రికార్డుల ప్రకారం అప్పటి నుంచి సికందర్ పరారీలో ఉన్నాడు. అయితే అతను స్వేచ్ఛగా బయట తిరుగుతూ గుడియా దేవి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఇటీవల జరిగిన టికౌలీ పంచాయతీ ఎన్నికల్లో సికందర్ తన రెండో భార్య గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవి పేరుతో నామినేషన్ వేయించాడు. అంతేగాక గుడియాను మొదటి భార్య మిత్లేష్ దేవిగా కోర్టులో హాజరుపరిచి.. తాను బతికే ఉన్నానని, తన భర్తను నిర్దోషిగా ప్రకటించాలని చెప్పించేందుకు పథకం వేశాడు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు.

English summary

A woman died before 9 years but she won in elections now