బికినీ వేసుకుని కిటికీలో సన్ బాత్

A woman doing sun bath in window

03:44 PM ON 8th July, 2016 By Mirchi Vilas

A woman doing sun bath in window

సాధారణంగా సన్ బాత్ అంటే ఏ బీచ్ కో లేక ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ కో వెళ్లి చేస్తారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఒక వెరైటీ సన్ బాత్ కనుక్కుంది. ఆ వివరాల్లోకి వెళితే.. రష్యా పట్టణం నోవోసిబిర్క్స్ క్రోసట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీ నుంచి ప్రతీ రోజు కన్పించే దృశ్యం ఇరుగు పొరుగు వుండే వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అపార్ట్మెంట్ రెండో అంతస్తులో నివసించే ఒక మహిళ బికినీ ధరించి తల భాగం లోపల, మిగిలిన భాగం బయటకు ఉంచుతూ బయట ఉండే వాళ్ళని కొందరినీ ఆకట్టుకోవటమే కాకుండా, మరి కొందరిని చికాకు కల్గిస్తోంది. ప్రతీ రోజా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విండో సన్ బాత్ చేస్తుంది.

దీంతో ఆమె అక్కడి వార్తల్లో హల్ చల్ చేస్తుంది. కాలనీ వాసులు దీన్ని తప్పుపడుతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారని, ఆమె అందాల ఆరబోత భరించలేకపోతున్నామని తిట్టి పోస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లుగా ఆమె తన పని కొనసాగిస్తుంది. దీన్ని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు రష్యా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా సన్ బాత్ సుందరి మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

English summary

A woman doing sun bath in window