అబ్బో ... ఈ బామ్మకు ఈ చిన్నారి ఏమౌతుందో తెలిస్తే మతిపోద్ది

A Woman From Canada Becomes Great Great Great Grandmother

11:25 AM ON 8th December, 2016 By Mirchi Vilas

A Woman From Canada Becomes Great Great Great Grandmother

సాధారణంగా ఒక కుటుంబంలో నాలుగు తరాల వారు ఉండడం మనకు విశేషమే. అయిదో తరాన్ని కూడా చూడగలగడం అత్యంత అరుదుగా ఉంటుంది. కానీ కెనడాకి చెందిన వెరా సోమర్ ఫెల్డ్ మాత్రం ఏకంగా తన మనవరాలి ముని మనవరాలిని ఎత్తుకుంది. అంటే ఆ ఇంట్లో మనం ఏకంగా ఆరు తరాలను చూడవచ్చన్నమాట. 96 ఏళ్ల వెరా మొన్న అక్టోబరులోనే చిన్నారి క్యాలీని ఎత్తుకుని ఆ అద్భుతమైన క్షణాలను ఆస్వాదించింది. వెరా, ఆమె కుమార్తె, మనవరాలు, ముని మనవరాలు అల్బెర్టాలో లెత్ బ్రిడ్జి అనే వూళ్లొ ఉంటారు. ఆ తర్వాత మిగిలిన రెండు తరాల వాళ్లు మాత్రం వేరే చోట ఉన్నా ఇప్పుడిక నెలకోసారి ఆరుగురూ తప్పనిసరిగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ సందర్భంగా ఫొటో దిగారు.

ఇక వీరి వయస్సులను పరిశీలిస్తే, రెండు నెలల చిన్నారి క్యాలీ తల్లి అలీసా వయసు 20. ఇక అలీసా తల్లి అమందా వయసు 39 ఏళ్ళు. అమందా తల్లి గ్రేస్ 59 ఏళ్లకే ముని మనవరాలినెత్తుకుంది.

ఇక గ్రేస్ తల్లి గ్వెన్ వయసు 75 ఏళ్ళు . అలాగే గ్వెన్ తల్లి వెరాకి 96 ఏళ్లు. అలా వందేళ్ల వయసులోపల ఆరు తరాల అతివలు ఒకే కుటుంబంలో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జన్యుపరంగా సంక్రమించిన ఆరోగ్యమే తమ అదృష్టమంటున్నారు ఈ అమ్మమ్మలు. గిన్నిస్ రికార్డుల్లో ఇప్పటికే ఏడు తరాల రికార్డు ఉంది. అయితే ఆరు తరాలు చేరుకోవడమూ అరుదే.. అందులోనూ వరసగా అందరూ ఆడపిల్లలు కావడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:స్మార్ట్ ఫోన్ లేకున్నా జియో ... రిలయన్స్ బంపరాఫర్

ఇవి కూడా చదవండి:టాయిలెట్ వాడుకుని చెక్ ఎంతిచ్చాడో తెలిస్తే షాకౌతారు!

English summary

A 96 Year Old Woman was become Great Great Great Mother and the Six Generations Ladies were gathered together and took a photo and now this was going viral over the internet.