అద్భుతం! ఎగిరే విమానంలోనే బిడ్డను కన్న తల్లి.. ఆ తరువాత..

A woman gave a birth in mid air flight

03:12 PM ON 18th August, 2016 By Mirchi Vilas

A woman gave a birth in mid air flight

బిడ్డ పుట్టడానికి డేట్ ఇస్తారు... కానీ డేట్ కన్నా ముందే హఠాత్తుగా డెలివరీ వస్తే, ఇక ప్రమాదమే... ఉరుకులు పరుగులే... ఇక విమానంలో అయితే మరీ కంగారు... కానీ అదే జరిగింది. విమానం ఆకాశంలో ఉండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చేసాయి. దీంతో అప్పటికప్పుడు క్యాబిన్ ముందుభాగమే పురిటిగదిగా మారింది. సమయానికి ఇద్దరు నర్సులు అదే విమానంలో ఉండటంతో ఆమెకు సకాలంలో సాయం అందింది. నెలలు నిండకుండానే.. హఠాత్తుగా పురిటి నొప్పులు పడుతున్న తల్లి స్వరం కాస్త మందగించగానే కేర్...కేర్ మంటూ ఓ లేత గొంతుక వినిపించింది. వెంటనే విమానంలోని వారందరి ముఖంపై ఆతృత మాయమై చిరునవ్వు వెలిగింది.

సిబ్బంది హడావుడిగా విమానంలో ఉన్న మినరల్ వాటర్ తో పసికందును శుభ్రం చేశారు. చిన్నపిల్లలతో ప్రయాణం చేస్తున్న ఓ తల్లి గబగబా క్యాబిన్ బ్యాగు తెరిచి పురిటి పాపాయికి దుస్తులిచ్చింది. ఈలోగా సిబ్బంది చకచకా వెళ్లి మెత్తని దుప్పటి పట్టుకొచ్చి చిన్నారితల్లికి వెచ్చగా కప్పారు. చేతిలో పాపాయితో ఉన్న తల్లికి ఫోటో తీసేశారు. సహ ప్రయాణికురాలెవరో దానిని ఫేస్ బుక్ లో కూడా పెట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే వినీలాకాశంలో దూసుకెళుతున్న ఆ విమానంలోని ప్రతి ఒక్కరూ స్పందించి.. తల్లికి పురుడుపోసి... పాపాయికి లాలపోసి... అమ్మ ఒడిలో ఉంచారు.

సెబూ పసిఫిక్ ఎయిర్ విమానంలో ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఆ సంస్థ విమానాల్లో జీవితాంతం ఈ పాపాయి ఉచిత ప్రయాణాలు చేయవచ్చట. అందుకే, తల్లీబిడ్డలిద్దరికీ వైద్యపరమైన సాయం అవసరం కావడంతో విమానాన్ని మార్గ మధ్యంలోనే హైదరాబాద్ కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, దుబాయ్ నుంచి మనీలా వెళ్లాల్సి ఉన్న ఆ విమానం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వెంటనే ఫిలిప్పీన్స్ కు చెందిన ఆ తల్లీబిడ్డలిద్దరినీ నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తల్లీ బిడ్డా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

English summary

A woman gave a birth in mid air flight