అక్కడ క్యూలో నిల్చుని బిడ్డనికంది!

A woman gave a birth to a baby girl in queue line

02:21 PM ON 5th December, 2016 By Mirchi Vilas

A woman gave a birth to a baby girl in queue line

ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, రూ. 1000 కరెన్సీ రద్దు కష్టాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. రద్దు జరిగి దాదాపు నెలకావస్తున్నా, దేశ ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల ముందు ఇంకా బారులు తీరే ఉంటున్నారు. ఈ సందర్భంలో ఏకంగా ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే వెలుగుచూశాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇంకొన్ని చోట్ల ఖాకీల కావరానికి పరాకాష్టగా నిల్చిన సందర్భాలూ లేకపోలేదు. అంతేకాదు, గంటలతరబడి ఏటీఎం సెంటర్ వద్ద క్యూలో ఉన్న ఓ యువతి సహనం కోల్పోయి బహిరంగంగా తన టీషర్ట్ విప్పేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భమూ ఉంది.

1/3 Pages

అయితే, తాజాగా 30ఏళ్ల మహిళ సొమ్ముల కోసం బ్యాంక్ దగ్గర క్యూలైన్లో నిల్చుని ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని దెహత్ జిల్లా కాన్పూర్ లో ఈ ప్రసవం జరిగింది. నెలలు నిండిన నిండు గర్భవతి అయిన సర్వేష అనే మహిళ ప్రసవ ఖర్చులకోసం తన అత్తతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు దగ్గర క్యూలో ఉంది.

English summary

A woman gave a birth to a baby girl in queue line