ఆమెకు ప్రెగ్నెన్సీ అనే తెలీదు... కానీ, మగ బిడ్డకు జన్మనిచ్చింది!

A woman gave a birth to baby without knowing her

11:25 AM ON 25th October, 2016 By Mirchi Vilas

A woman gave a birth to baby without knowing her

మిరాకిల్ అంటాం కదా. అవును కొన్ని ఊహకందని విషయాలు కళ్ళెదుటే జరిగితే షాకవుతాం. సరిగ్గా అలాంటిదే ఇది. ఆమెకు గర్భిణినన్న విషయం అస్సలు తెలీదట. అలాంటి ఆనవాళ్లే కనిపించలేదు. తీరా విషయం తెల్సిన అరగంటకు బిడ్డ పుట్టేసాడు. ఇది విన్నవాళ్ళు అవాక్కవడం ఖాయం. 38 వారాలపాటు కడుపులో బిడ్డ ఎదుగుతున్నా ఆమెకు దానికి సంబంధించిన ఆనవాలు కూడా కనిపించలేదు. బరువు పెరగలేదు, మోర్నింగ్ సిక్ నెస్ కు గురికాలేదు. సాధారణ మహిళగానే గడిపింది. అనుకోకుండా అనారోగ్యంగా అనిపించడంతో మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నాయేమోనని పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్తే, మరో 30 నిమిషాల్లో మగ బిడ్డ పుట్టబోతున్నాడని వైద్యులు చెప్పారట.

దీంతో ఆ దంపతులిద్దరూ నోట మాట రాక శిలల మాదిరిగా అయ్యారట. కాసేపటికి తేరుకుని అవసరమైన కార్యక్రమాలు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

స్టెఫానీ జేగర్స్ పొత్తి కడపులో నొప్పిగా ఉండటంతో ఆమె భర్త మైఖేల్ జేగర్స్ పీడ్మంట్ హెన్రీ హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. స్టెఫానీని పరీక్షించిన డాక్టర్లు గర్భవతి అయ్యారా? అని అడిగితే, ఆమె అదేం లేదని చెప్పిందట. తనకు రుతుస్రావం ఆగలేదని, గత ఏడాది ప్రీ మెనోపాజ్ చికిత్స జరిగిందని కూడా చెప్పుకొచ్చింది.. ఆమెకు క్యాట్ స్కాన్ చేయించాలని మొదట్లో వైద్యులు చిప్పినప్పటికీ, ఆ తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించాలని సలహా ఇచ్చారు. కాసేపటి తర్వాత వైద్యులు ఆ దంపతులకు శుభవార్త చెప్పారు.

English summary

A woman gave a birth to baby without knowing her