ఒకే కాన్పులో క్రికెట్ టీమ్ ని కనేసింది(వీడియో)

A woman gave birth to 11 babies

11:55 AM ON 29th July, 2016 By Mirchi Vilas

A woman gave birth to 11 babies

ఈ మహాతల్లి ఏకంగా ఒకే కాన్పులో క్రికెట్ టీమ్ ని కనేసింది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? నిజమండీ బాబు.. అసలు విషయంలోకి వెళితే.. సృష్టిలో అమ్మతనాన్ని మించిన గొప్పది మరొకటి లేదు. మంచి భార్య అనిపించుకోవడం కన్నా మంచి తల్లి అనిపించుకోడమే ముఖ్యమని ప్రతి స్త్రీ భావిస్తుంది. పిల్లల కోసం తల్లి పడే ఆవేదన వర్ణణాతీతం. ప్రతి మహిళ.. తాను తల్లి అయినప్పుడు పొందే ఆనందానికి అవధులుండవు. పిల్లలు లేని స్త్రీలు సంతానం కలగాలని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుతారు. పెద్దలు చెప్పినట్లు ఉపవాసాలు, దీక్షలు చేస్తారు. అయినా కొంతమంది మహిళలు పిల్లలు పుట్టక బాధ పడుతుంటారు.

అయితే ఇక్కడ ఓ మహిళ ఒకే కాన్పులో 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పటి వరకు కవలలు పుట్టడమే అరుదు అనుకున్నాం. ఒక్కోసారి నలుగురు, ఆరుగురు పుట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఒకేసారి 11 మంది పుట్టడం ఇదే మొదటిసారి. దాదాపు 20 మంది వైద్యులు ఆ మహిళకు ఆపరేషన్ చేసి 11 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. పిల్లలందరినీ ఒకే మంచంపై పడుకోబెట్టారు. ఒకసారి ఈ వీడియో పై మీరు ఒక లుక్ వేసేయండి.

English summary

A woman gave birth to 11 babies