ప్రేమను నిరూపించుకోమన్నందుకు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు(వీడియో)

A woman gets suicide for true love

11:03 AM ON 5th October, 2016 By Mirchi Vilas

A woman gets suicide for true love

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పైగా వారిద్దరూ బావమరదళ్లు కూడా. అందుకే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే ప్రియుడు ఎందుకో నిజంగా తనపైన ప్రేమ ఉంటే నిరూపించుకోవాలని ప్రియుడు చెప్పడంతో ఆ యువతి అన్నంత పని చేసేసింది. వివరాల్లోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో పంటకాలువపై నుంచి ప్రేమికులిద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. దివ్య, నాగేంద్ర పెళ్లి విషయం గురించి మాట్లాడుతుండగా వాగ్వాదం జరిగింది. నిజంగా నాపై ప్రేమ ఉందా.. ఉంటే ఈ కాలువలోకి దూకు అని ప్రియుడు రెచ్చగొట్టడంతో మరుక్షణమే ఆ యువతి దూకేసింది.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవానీ భక్తులు గమనించి ఆ యువతిని ప్రాణాలతో రక్షించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు. ఈ వార్త దావానంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

English summary

A woman gets suicide for true love