ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ నెల రోజులకే ఘోరం!

A woman gets suicide in rajamahendravaram

04:51 PM ON 13th August, 2016 By Mirchi Vilas

A woman gets suicide in rajamahendravaram

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళై నెల రోజులు కూడా గడవక ముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. ఆనంద్ నగర్ కు చెందిన నూకల లక్ష్మి(24), సిద్ధార్థనగర్ కు చెందిన లారీ డ్రైవర్ వీర్రాజు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో ఈ విషయం చెప్పి జూలై 3న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మి తల్లిదండ్రులు రూ.2 లక్షలు కట్నం, కొంత బంగారం అబ్బాయికి ఇచ్చి కొత్త కాపురానికి పంపించారు. రెండు రోజులకే లారీపై బాకీ ఉందంటే, మరో రూ.28 వేలు అల్లుడికి ఇచ్చారు.

ఆ తర్వాత వీర్రాజు తనకు రూ.7 లక్షల కట్నం ఇచ్చే సంబంధాలు వస్తున్నాయని, అదనపు కట్నం ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని వీర్రాజు, లక్ష్మిని బెధిరించడం మొదలుపెట్టాడు. ఇలా పెళ్లి చేసుకొన్న వారం రోజులనుండి భర్త వేధించడం మొదలుపెట్టాడు. అవి తట్టుకోలేక లక్ష్మి మంగళవారం ఇంట్లో శ్లాబ్ హుక్కుకు ఓణీతో ఉరివేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసమే వీర్రాజు ఆమెను వేధించి, హతమార్చి ఉంటాడని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

A woman gets suicide in rajamahendravaram