అతి పెద్ద మొసలిని పట్టుకుని రికార్డు సృష్టించారు!

A woman hunted a big crocodile

12:52 PM ON 1st September, 2016 By Mirchi Vilas

A woman hunted a big crocodile

నల్లటి చారలు... అత్యంత బరువు... పొడుగు ఉన్న మొసలిని చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. అయితే అమెరికాలోని విక్స్ బర్గ్ కు చెందిన ఓ మహిళ మరో ఐదుగురు వేటగాళ్లతో కలిసి నది నీటి ప్రవాహం నుంచి అతిపెద్ద మొసలిని పట్టుకొని సాహసాల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు. అమెరికాలోని మిస్సీస్సీపీలోని క్లయిబోర్న్ కౌంటి పోర్టు గిబ్సన్ వద్ద రాత్రివేళ టిఫానీ వీన్కే అనే ఓ మహిళ మరో ఐదుగురు వేటగాళ్లతో కలిసి 686 పౌండ్ల బరువున్న పెద్ద మొసలిని పట్టుకొని సాహసంలో రికార్డు నెలకొల్పారు. రెండు గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్నామని టిఫానీ చెప్పారు. 13 అడుగుల పొడవు, 7.7 అంగుళాల లావు ఉన్న ఈ మొసలి అతిపెద్దదని మిస్సీస్సీపీ వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు.. ఆ పై..

English summary

A woman hunted a big crocodile. A woman creates a record by hunting bog crocodile.