చిన్నప్పుడు తీసుకున్న పుస్తకాన్ని అమ్మమ్మయ్యాక ఇచ్చింది

A Woman In New Zealand Returns Book To Library After 68 Years`

12:15 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

A Woman In New Zealand Returns Book To Library After 68 Years`

ఇదేదో ఇంటరెస్టింగ్ గా వుంది కదూ...ఎందుకంటే సాధారణంగా లైబ్రరీలో నుంచి తీసుకున్న పుస్తకాన్ని గడువు తేదీలోగా తిరిగి ఇచ్చేయాలి లేదంటే.. జరిమానా కట్టాల్సిందే.అయితే, ఆక్లాండ్‌కు చెందిన ఓ మహిళ తన చిన్నతనంలో తీసుకున్న పుస్తకాన్ని ఏకంగా అమ్మమ్మ అయ్యాక తిరిగిచ్చింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో చోటుచేసుకున్న ఈ వింత ఘటన వివరాల్లోకి వెళ్తే,

ఎప్సమ్‌ లైబ్రరీ నుంచి 1948లో ఆక్లాండ్‌కు చెందిన ఓ చిన్నారి ఏ.డబ్ల్యూ రీడ్‌ రచించిన ‘మైత్స్‌ అండ్‌ లెజెండ్స్‌ ఆఫ్‌ మవోరిలాండ్‌’ అనే పుస్తకాన్ని తీసుకుంది.దాన్ని 1948, డిసెంబర్‌ 17వ తేదీలోగా గ్రంధాలయానికి తిరిగి అప్పగించాలి. కాని అనుకోకుండా ఆ చిన్నారి కుటుంబం ఆక్లాండ్‌ విడిచి వెళ్లిపోయింది. అలా ఆ పుస్తకం తనతో పాటు తీసుకెళ్లింది. ఇప్పుడు తన కుటుంబంతో కలిసి మళ్లీ ఆక్లాండ్‌ను సందర్శించేందుకు వచ్చింది. అదీ కూడా దాదాపు 68 సంవత్సరాల తర్వాత. ఆ మహిళ గ్రంధాలయం నుంచి తాను తీసుకున్న పుస్తకాన్ని కూడా వెంట తీసుకొచ్చి గ్రంధాలయ అధికారులకు అప్పగించింది. ఎప్పుడో 68 సంవత్సరాల తర్వాత తీసుకున్న పుస్తకాన్ని గుర్తుపెట్టుకొని మళ్లీ తిరిగి తెచ్చినందుకు వారు ఆశ్చర్యపోయారు. పుస్తకం తిరిగి ఇచ్చి, గ్రంధాలయ సిబ్బందితో కాసేపు మాట్లాడింది. పుస్తకం అపురూపమైనది.అందుకే అంతే అపురూపంగా తిరిగి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: ఆమెకు మొత్తం 69 మంది పిల్లలు

ఇవి కూడా చదవండి:మనం ఎప్పుడు చనిపోతామో దీని ద్వారా తెలుసుకోవచ్చు!

English summary

A Woman in New Zealand Returns book to Library after 68 years to library. She took the book named" Myths and Legends of Maoriland " in December 17th in the year 1948 . After her family went ferom that place and she came to that place after 68 long years and returned that book to library.