పెళ్ళైన వ్యక్తితో ప్రేమ యవ్వారం - కూతురిని చంపేసిన తల్లి

A Woman Killed Her Daughter For Loving Married Guy

10:31 AM ON 8th July, 2016 By Mirchi Vilas

A Woman Killed Her Daughter For Loving Married Guy

ఆమధ్య కాల్ మనీ వ్యవహారంతో అట్టుడికిన విజయవాడలో పరువుకు పాకులాడే కుటుంబంలో హత్య చేస్తుకుంది. పరువు కోసం అల్లారుముద్దుగా పెంచిన కూతురిని కన్నతల్లే చంపేసింది. కన్న పేగు బంధం అంతలా కసాయిగా మారడానికి కారణం, పెళ్లయిన వ్యక్తితో ప్రేమ పేరుతో తిరగడమే. తాను ఎంత చెప్పినా వినకపోయేసరికి సహనం నశించి చంపేశానని నిందితురాలు బీబీజాన్ చెబుతోంది. సంచలనం రేపిన ఈ ఘటన విజయవాడ వాంబేకాలనీలో చోటుచేసుకుంది. 16 ఏళ్ల యువతి షేక్ నజ్మ.. ఎదురింటిలో పెళ్లై ఇద్దరు పిల్లలున్న దీపక్ తో ప్రేమ వ్యవహారం నడిపింది. తల్లితోపాటు చుట్టు పక్కల వాళ్లు పదేపదే చెప్పినా వినిపించుకోకుండా నజ్మ..ఆ వ్యక్తితో చనువు సాగించింది. ఈ విషయమై తల్లికూతురికి మధ్య అనేక సార్లు మాటా మాటా పెరిగి, ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కూతుర్ని కడతేర్చింది.

నజ్మాను చంపేసిన తల్లి... తెల్లవారుజామున అందరికీ అనుమానం వస్తుందని గ్రహించి, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ నజ్మ చనిపోయిందని ఓ కట్టుకథ అల్లి స్థానికుల సాయంతో తన సొంతూరు కంచికచర్లకు కూతురు మృతదేహంతో బయలుదేరింది. ఎదురింటిలోవున్న ప్రియుడు దీపక్ కు అనుమానం రావడంతో పోలీసులకు చెప్పేసాడు. దీంతో అసలు రంగు బయటపడింది. పరువుపోతుందనే కూతుర్ని చంపానని పోలీసుల ఎదుట తల్లి ఒప్పేసుకుంది. తల్లిచేతిలో మృతిచెందిన నజ్మాకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మానవతా దృక్పధంతో అంత్యక్రియులకు తల్లిని పోలీసులు అనుమతించారు.

ఇవి కూడా చదవండి:ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చి ... ఆపై .. ప్రాణమే పోయింది

ఇవి కూడా చదవండి:పాపం.. బాబుని ఉతికి ఆరేసిన నీతి ఆయోగ్

English summary

A Woman Named Bibijaan in Vijayawada killed her daughter for loving a married guy who had two children. Later she was arrested by the police and allowed her to do cremation to her daughter and later she was taken her into the custody.