ఫేస్బుక్ ప్రియుడు కోసం పోలీసు భర్తనే చంపేసింది!

A woman killed her husband for lover

05:38 PM ON 26th April, 2016 By Mirchi Vilas

A woman killed her husband for lover

రాను రాను అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి.. పెళ్ళైన వాళ్ళు కూడా వేరే వాళ్ళ పై ఆశ పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే. ఎక్కడో బహరైన్ లో ఉండే ఓ యువకుడితో పంజాబ్ కి చెందిన ఓ వివాహితకు ఫేస్ బుక్ లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా మొహంగా మారింది. అప్పటికే పెళ్లై, 14 ఏళ్ల కొడుకు ఉన్న సుఖదీప్ కౌర్ అనే ఆ మహిళ, ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన భర్త జస్వీర్ సింగ్ ని అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.

ఇది కూడా చదవండి: నాగ్-బాలయ్య మధ్య వైరం ఇంకా చల్లారలేదా?

అందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్స్ ని సంప్రదించింది. ముగ్గురు కిల్లర్స్ కి తన భర్తని చంపేందుకు 5 లక్షల డబ్బు ఇచ్చింది. ముందుగా సుఖదీప్ కౌర్ తన భర్తకు నీటిలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అవి తాగి, స్పృహ కోల్పోయిన జస్వీర్ సింగ్ కి అండర్ వేర్ తప్ప మిగిలిన బట్టలన్నీ తొలగించి, ముగ్గురు కిల్లర్స్ తో కలిసి తీసుకెళ్ళి భాక్రా కెనాల్ లో పడేసారు. ఆ తర్వాత కొన్ని రోజులకి తన భర్త మిస్సింగ్ అని కేసు పెట్టింది. ఏప్రిల్ 19న గుర్తు పట్టలేని స్థితిలోఉన్న జస్వీర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో, అసలు కథ బయటకు వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో సుఖదీప్ కౌర్ అసలు నిజాన్ని బయట పెట్టింది.

ఇది కూడా చదవండి: టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

ఇంతకీ ఎవరికోసం అయితే, తన భర్తని చంపించిందో, ఆ యువకుడిని ఇంతవరకు సుఖదీప్ కలవనేలేదట. కేవలం సోషల్ మీడియాలో పరిచయం, చాటింగ్ తోనే అతన్ని నమ్మి భర్తను చంపుకుంది. అంతేకాదు, అప్పటిదాకా తను చాట్ చేసింది, లవ్ చేసింది, ఒక వివాహితని అని అతనికి కూడా తెలియదట. ఇంతకీ ఆ హత్యలో సుఖదీప్ కి సహకరించిన ఆ కిల్లర్స్ వయసు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కిల్లర్స్ లో ఒకడి వయసు 20 ఏళ్ళు, బిసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండోవాడి వయసు 21, బిటెక్ చదువుతున్నాడు. ఇక మూడో వాడి వయసు 22, హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ కంప్లీట్ చేసాడు.

ఇది కూడా చదవండి: షిర్డీ సాయి హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు

ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న, ఈ ముగ్గురు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా మారడం మన సమాజంలో పొంచిఉన్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సెక్స్, మనీ, మందు ఈ మూడే ఇప్పుడు సమాజాన్ని శాసిస్తున్నాయి. ఈ మూడిటి కోసం, ఎంత ఘోరాలు, నేరాలు చేయడానికి యువత సిద్ధం అయిపోవడం మనందరం కలవరపడాల్సిన విషయం.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఈ దేవునికి రూపం లేదు!

English summary

A woman killed her husband for lover. A punjab woman killed her Police husband for facebook boyfriend.