ఆ మహిళా ఎంపీ ఓటుహక్కుకి శృంగారానికి లింకు పెట్టింది

A Woman linked Romance with right to vote

11:16 AM ON 19th January, 2017 By Mirchi Vilas

A Woman linked Romance with right to vote

ఎన్నికలన్నాకా సవాలక్ష హామీలు, మాటలు ఉంటాయి. ఇక ప్రజా ప్రతినిధి అయ్యాక ఆయా సందర్భాల్లో మాట్లాడే మాటలు కూడా వెరైటీగానే ఉంటాయి. అయితే ఓ ప్రజా ప్రతినిధి అందునా ఓ మహిళా ఎంపీ ఓటుహక్కుకీ, శృంగారానికి లింకు పెట్టింది. అవును నిజం, ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కెన్యాలోని ఓ మహిళా ఎంపీ ఈవిధంగా వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. దేశంలోని మహిళలంతా తమ భర్తలు ఓటు హక్కు పొందేవరకు శృంగారానికి అంగీకరించొద్దని పిలుపునిచ్చారు. అలా చేస్తే ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తున్న మగాళ్లలో మార్పు వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతకీ అసలు విషయం ఏమంటే, కెన్యాలో ఈ ఏడాది ఆగస్టు 8న పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలో సుమారు 90లక్షల మంది అర్హత ఉండి కూడా ఓటు హక్కుకోసం పేర్లు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపడంలేదట. వాళ్లందరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో తాజాగా అక్కడి ఎన్నికల అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఫిబ్రవరి 17తో ఓటరు నమోదుకు గడువు ముగియనుందట.

దీంతో కెన్యాలోని మొంబాసా పట్టణానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ మిషీ మోకో.. తాజాగా ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో దాదాపు 90 లక్షల మంది అర్హత ఉండి కూడా ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేయించుకోకపోవడంపై స్పందిస్తూ.. ఓటు హక్కు పట్ల మహిళలంతా చైతన్యవంతులు కావాలి. శృంగారాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. ఓటరుగా నమోదు చేయించుకోవడాన్ని అశ్రద్ధ చేస్తున్న తమ భర్తల్లో మార్పు వచ్చేలా ఆ ఆయుధాన్ని వినియోగించుకోండి. ఓటర్‌ ఐడీ చూపించేంతవరకు శృంగారానికి నిరాకరించండి. నా భర్తకు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు ఓటర్‌ ఐడీ ఉంది!’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇది కూడా చూడండి : ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి : మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి : న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

English summary

A Woman in election canvasing Suggests all the women that " ask your husband to get vote authority so then only allow them to participate in romance.